ప్రేమ వివాహం విషాదాంతం.. నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు.

ప్రేమ వివాహం విషాదాంతం.. నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి వివాహం జరిగిన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన రాజాజీనగర్‌లోని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసుల సమాచారం మేరకు, శ్వేత అనే యువతి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె తన భర్తతో కలిసి సుంకదకట్టే ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోకుండా నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.

ఫ్యాటీ లివర్ నుంచి రక్షణలో కాఫీ పాత్ర.. పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?

అయితే, ఇటీవల శ్వేత తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలిలో లభించిన సూసైడ్ నోట్‌లో తన మరణానికి భర్తతో పాటు అతని చెల్లెలే కారణమని ఆమె ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు.

సూసైడ్ లేఖలో, “అమ్మా.. నేను పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు. నేను చనిపోయిన తర్వాత కూడా వారికి శిక్ష పడేలా చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టొద్దు” అని శ్వేత రాసినట్లు సమాచారం.

టాలీవుడ్ డాన్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య ఉద్రిక్తత

ఘటనపై కేసు నమోదు చేసిన కామాక్షిపాళ్య పోలీసులు శ్వేత భర్తతో పాటు అతని చెల్లెలును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఆరోపణలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *