తెలంగాణలో బార్లు బంద్‌! అసలు కారణం ఇదే..

1280X720 3

తెలంగాణలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఫీజులు, లైసెన్స్‌ నిబంధనలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 5 నుంచి ఈ బంద్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలో సుమారు 1,200కు పైగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై దీని ప్రభావం పడనుంది.

బార్లపై ‘ప్రివిలేజ్‌ సెస్‌’ పేరుతో అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ సెస్‌ను 8 శాతం నుంచి 20 శాతం వరకు పెంచాలని నిర్ణయించిందని, దీంతో ఒక్కో బార్‌పై ఏడాదికి సుమారు రూ.30 లక్షల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఇప్పటికే లైసెన్స్‌ ఫీజుల రూపంలో భారీ మొత్తాలను చెల్లిస్తున్నామని అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

ALSO READ: యువతలో గుండె ఆరోగ్యానికి రోజూ 10 నిమిషాల వ్యాయామం ఎందుకు ముఖ్యం?

image 2

గతంలో ఉన్న లైసెన్స్‌ ఫీజును కూడా పెంచడం తమ వ్యాపారాలపై మరింత ఒత్తిడిని పెంచుతోందని బార్‌ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించి ప్రివిలేజ్‌ సెస్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు.

అంతేకాకుండా, తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు అసోసియేషన్‌ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బార్‌ యజమానులు హెచ్చరించారు.

దీంతో తెలంగాణలో బార్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలపై తాజా బంద్‌ ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం–బార్‌ యజమానుల మధ్య చర్చలు జరిగి సమస్యకు పరిష్కారం లభిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ALSO READ: Adaso Kapesa: ప్రధాని మోడీని నీడలా రక్షించే తొలి మహిళా ఎస్పీజీ కమాండో ఎవరో తెలుసా?

Related Post