తెలంగాణలో ఎల్‌నినో ఎఫెక్ట్‌.. రెండో పంటపై రైతులకు మంత్రుల కీలక సూచనలు

ponguleti srinivas
ponguleti srinivas

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, ఎండలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులు పంటల సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నీటి లభ్యతను అంచనా వేసుకోకుండా రెండో పంట వేసి ఇబ్బందులు పడవద్దని సూచించారు.

విద్యుత్‌, సాగునీటి కొరత ఏర్పడే అవకాశాలున్నందున అందుబాటులో ఉన్న వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలిపారు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ సిద్ధం చేస్తోందని చెప్పారు.

మొదటి పంటను కాపాడేందుకు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు సాగు నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

ALSO READ: యువతలో గుండె ఆరోగ్యానికి రోజూ 10 నిమిషాల వ్యాయామం ఎందుకు ముఖ్యం?

Related Post