KALAVAKUNTLA KAVITHA: సింగరేణి బకాయిలు చెల్లిస్తే కరెంట్ సమస్య ఉండదు.
KALAVAKUNTLA KAVITHA: తెలంగాణలో విద్యుత్ సమస్యకు సింగరేణి బకాయిలు కూడా ఒక కారణమని తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కవిత అన్నారు. సింగరేణికి ప్రభుత్వం సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో బొగ్గు సరఫరాపై ప్రభావం పడుతోందని ఆమె ఆరోపించారు. సింగరేణి బొగ్గును ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోవడం, ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను రైతులకు అందించలేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని కవిత డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక క్యాబినెట్ సమావేశం నిర్వహించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ సమస్యతో పాటు తాగునీటి కొరత కూడా తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO READ: అధిక నెలసరి రక్తస్రావం తగ్గించుకోవచ్చా? 25% Sperm Count ని రెండు వారాల్లో పెంచే పొడి ఇది.
కృష్ణా, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని కవిత(KALAVAKUNTLA KAVITHA) విమర్శించారు. మహబూబ్‌నగర్ ప్రాంతానికి కృష్ణా జలాలను అందించేందుకు నార్లాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. రిజర్వాయర్‌కు సంబంధించిన మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

కరువు పరిస్థితులపై తమ పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపడతామని ఆమె (KALAVAKUNTLA KAVITHA)తెలిపారు. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు గ్రామాలు, మండలాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని చెప్పారు.
ALSO READ: ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. 15 తులాల బంగారం మాయం.
అదేవిధంగా 317 జీవోకు సంబంధించిన సమస్యపై కూడా కవిత స్పందించారు. ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేస్తున్న సమయంలో మహిళా ఉపాధ్యాయులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. 317 జీవో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
