మల్టీలెవల్ మార్కెటింగ్ ట్రాప్..

మల్టీలెవల్ మార్కెటింగ్ ట్రాప్..

చిన్న మొత్తాలతో మొదలై భారీ స్థాయిలో ముగిసే మల్టీ లెవెల్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధిక వడ్డీ, తక్కువ సమయంలో భారీ లాభాలు అనే ఎరతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్న కేటుగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుని పరారవుతున్నారు. మంచి స్కీమ్ అనుకుని చేరిన వారు చివరికి మోసపోయామని తెలుసుకుని నష్టపోతున్నారు.

తిరుమల 1970 లో ఎలా వున్నదో చూడండి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో 100 కోట్ల స్కామ్ చేసిన వఐపిఎస్ సంస్థ మరోసారి కొత్త పేరుతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట సమావేశాలు నిర్వహించి, భారీ లాభాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ప్రజలను ఆకర్షించింది. అయితే ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసి 10 మంది డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వినోద్ తుకారం సహా మరికొందరు పరారీలో ఉన్నారు.

ఇక కరీంనగర్ జిల్లాలో యూనిక్ మార్కంటైల్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థపై కూడా భారీ మోసం ఆరోపణలు వెల్లువెత్తాయి. 2013 నుంచి 2020 వరకు పెట్టుబడులు సేకరించిన ఈ సంస్థ, మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా కస్టమర్లను మోసం చేసింది. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు.

పేగుల్లో గుడ్ బ్యాక్టీరియా నశిస్తుంది దీన్ని తింటే….

తెలంగాణ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలు వెలుగుచూస్తున్నప్పటికీ, కొన్నిచోట్ల ఇప్పటికీ అధికారిక ఫిర్యాదులు నమోదు కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాధితులు న్యాయం కోసం ఉద్యమాలకు సిద్ధమవుతుండగా, ఇలాంటి మోసాలపై పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మంగ్లీ భాగోతం బయటపెట్టిన అడ్వకేట్ సుబ్బారావు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *