రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర.. దానిని తిప్పి కొట్టాం.

రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర.. దానిని తిప్పి కొట్టాం.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగ మార్పుల పేరిట రిజర్వేషన్లను రద్దు చేసే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తీసుకొచ్చిన చట్టాలను ప్రజల మద్దతుతో ఓడించామని తెలిపారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేయకుండా వెంటనే సభలో ప్రవేశపెట్టి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పేగుల్లో గుడ్ బ్యాక్టీరియా నశిస్తుంది దీన్ని తింటే….

2027 నుంచే రాష్ట్ర శాసనసభల్లో, 2029లో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది రాజకీయ ప్రయోజనాల విషయం కాదని, మహిళలకు ఇవ్వాల్సిన హక్కు అని స్పష్టం చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఈ బిల్లును ఆమోదించాలని పిలుపునిచ్చారు.

డీలిమిటేషన్ విధానంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత విధానం దక్షిణ–ఉత్తర రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచుతుందని, దేశ సమైక్యతకు హాని కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీట్ల పెంపు కాదు, దానికి అనుసరిస్తున్న విధానం తప్పు అని తెలిపారు.

తిరుమల 1970 లో ఎలా వున్నదో చూడండి.

అలాగే, కేంద్ర నాయకత్వాన్ని సంతోషపెట్టడమే లక్ష్యంగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయాలు సూచించాలని కోరారు. దేశ సమగ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *