సూర్య గ్రహణం ప్రభావంతో 4 రాశులవారికి జరిగేది ఇదే..?

సూర్య గ్రహణం ప్రభావంతో 4 రాశులవారికి జరిగేది ఇదే..?

శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గ్రహణాలు ప్రతి సంవత్సరం వచ్చినా, ప్రతి గ్రహణానికి ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. రాబోయే సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026 మంగళవారం రోజున మాఘ బహుళ అమావాస్య నాడు సంభవించనుంది. ఇది ధనిష్ట నక్షత్రం నాలుగవ పాదంలో జరిగే రాహుగ్రస్త కంకణగ్రాస సూర్యగ్రహణం. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు; అంటార్కిటికా ప్రాంతంలో మాత్రమే దర్శనమిస్తుంది.

Herbal Drink for Headaches:ఔషధ శక్తి దాగి ఉన్న హెర్బల్ టీ ఇది.

భారతదేశంలో కనిపించని కారణంగా సూతకం, దేవాలయాలు మూయడం, ప్రత్యేక నిషేధాలు అవసరం లేదు. సాధారణ ప్రజలు తమ నిత్యకర్మలు, భోజనాలు యథావిధిగా చేసుకోవచ్చు. అయితే ఉపాసకులకు ఇది పుణ్యకాలంగా భావించబడుతుంది. ఈ సమయంలో జపం, ధ్యానం, యాగాలు చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.

ఈ గ్రహణం పంచగ్రహ కూటమిలో జరుగుతున్నందున ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక పరిణామాలు, యుద్ధ పరిస్థితులు, మార్కెట్‌లో మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెరిగే సూచనలు ఉన్నాయి. గతంలోనూ ఇలాంటి గ్రహణాల సమయంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగిన ఉదాహరణలు ఉన్నాయి.

ఎవ్వరూ బంగారం కొనొద్దు..! అందరం కలిసి ఉద్యమం చేద్దాం.

రాశి ఫలితాల విషయానికి వస్తే—ధనుస్సు, మేష, వృషభ, కన్య రాశుల వారికి ఈ గ్రహణం శుభఫలితాలు ఇస్తుంది. ధైర్యం, ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి, శత్రువులపై విజయం వంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక రాశుల వారు మాత్రం ఆరోగ్యం, ఖర్చులు, మానసిక ఒత్తిడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

ఈ గ్రహణ ప్రభావం సుమారు 45 రోజులు, చైత్ర పౌర్ణమి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో అపోహలకు పోకుండా, శాంతిగా, ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగితే శుభఫలితాలు పొందవచ్చని గురువులు సూచిస్తున్నారు.

Cancer: రాత్రిపూట లేటుగా అన్నం తినే వారికి క్యాన్సర్ వస్తుందా?

Geetha Madhuri: యూరియా వేసే పరికరం తయారు చేసిన విద్యార్థి గీతా మాధురి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *