“పేర్లో ఏముంది?” అని అనుకునేవారికి తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేటాయింపు ఓ ఆసక్తికర సమాధానంగా మారింది. పేరులోనే అసలు మహిమ దాగి ఉందేమో అనిపించేలా టిటిడి డిప్ విధానంలో జారీ చేసిన దర్శన టికెట్లు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా భగవంతుడి నామాలు కలిగిన భక్తులకు ఎక్కువ సంఖ్యలో టోకెన్లు రావడం విశేషంగా నిలిచింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి టిటిడి అనుమతి ఇచ్చింది. ఈ 10 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసి, భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనాన్ని అందించనుంది.
టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.
మొదటి మూడు రోజుల దర్శనానికి సంబంధించి గతంలో అమలులో ఉన్న ఆఫ్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే టోకెన్లను జారీ చేసింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా, డిసెంబర్ 2న డిప్ విధానంలో టికెట్ల కేటాయింపు జరిగింది.
ఈ డిప్ విధానానికి దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది. మొత్తం సుమారు 23 లక్షల 64 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, టిటిడి దాదాపు 8 లక్షల 89 వేల దర్శన టోకెన్లను కేటాయించింది. దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు దుబాయ్ నుంచి వచ్చిన భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు లభించాయి.
నరాల బలహీనత, కాళ్లలో వణుకు, Stress అన్నిటినీ తగ్గించే బ్రహ్మాస్త్రం ఇది.
ఇక్కడే అసలు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. డిప్ విధానంలో జారీ అయిన టోకెన్లలో దాదాపు 21 వేలకుపైగా టోకెన్లు నాలుగు ప్రత్యేక పేర్లు కలిగిన భక్తులకే రావడం చర్చకు దారి తీసింది. ఇక్కడ నాలుగు పేర్లు అంటే నలుగురు వ్యక్తులు కాదు, వివిధ ప్రాంతాలకు చెందిన ఒకే పేర్లు కలిగిన వేలాది మంది భక్తులు.
వెంకట, శ్రీనివాసులు, లక్ష్మి, కృష్ణ వంటి భగవంతుడి నామాలు కలిగిన వారికి ఎక్కువగా దర్శన టోకెన్లు లభించాయి. వెంకట్ అనే పేరుతో 6,983 మంది భక్తులు టోకెన్లు పొందగా, లక్ష్మి పేరుతో 6,961 మంది ఉన్నారు. కృష్ణ పేరుతో 4,600 మంది, శ్రీనివాసులు పేరుతో 3,320 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి అర్హత సాధించారు.
సోషల్ మీడియా పరిచయాలు మరో విషాదానికి దారి తీశాయి.
మొత్తంగా భగవంతుడి నామాలు కలిగిన సుమారు 15 శాతం మంది భక్తులకు దర్శన టికెట్లు దక్కడం యాదృశ్చికమా, లేక ఏడుకొండల స్వామి మహిమేనా అన్న చర్చ భక్తుల్లో జోరుగా సాగుతోంది.