Baramati Plane Crash | గాల్లో నుంచి ఒక్కసారిగా కుప్పకూలిన విమానం.. బారామతిలో షాకింగ్ విజువల్స్.

Baramati Plane Crash | గాల్లో నుంచి ఒక్కసారిగా కుప్పకూలిన విమానం.. బారామతిలో షాకింగ్ విజువల్స్.

Baramati Plane Crash: మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయం వద్ద విమాన ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2026 జనవరి 28న ముంబై నుంచి బారామతికి వెళ్తున్న Learjet 45XR విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానంలో ఉన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందారు.

ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్లో విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. విమానం ఒక్కసారిగా ఎడమవైపు ఒరిగి, అనంతరం కిందకు పడిపోయినట్లు వీడియోలో నమోదైంది. నేలను ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగాయి.

ALSO READ: కేసీఆర్ నర్సంపేట పర్యటన.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పరామర్శ | KCR Narsampet Visit

ఈ ప్రమాదంపై Aircraft Accident Investigation Bureau (AAIB) దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి దారితీసిన అంశాలపై పలు పరిశీలనలు, తాత్కాలిక సిఫార్సులు వెల్లడయ్యాయి. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు తుది దర్యాప్తు కొనసాగుతోంది.

బారామతి విమాన ప్రమాదానికి సంబంధించిన ఈ షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన క్షణాల్లో విమానం ఎలా అదుపు తప్పిందనే విషయాన్ని ఈ దృశ్యాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

ALSO READ: జుట్టు ఆరోగ్యానికి మునగ గింజల నూనె ఉపయోగకరమా? పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *