స్మార్ట్ కిచెన్‌లో ఆకస్మిక తనిఖీ.. మధ్యాహ్న భోజన నిర్వహణ, సిబ్బంది సమస్యలపై అధికారుల ఆరా

స్మార్ట్ కిచెన్‌లో ఆకస్మిక తనిఖీ.. మధ్యాహ్న భోజన నిర్వహణ, సిబ్బంది సమస్యలపై అధికారుల ఆరా

పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను అధికారులు ఆకస్మికంగా పరిశీలించారు. వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యత, సరుకుల నిల్వ, వంట ప్రక్రియ, రవాణా విధానం, సిబ్బంది సమస్యలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

పరిశీలన సందర్భంగా వంటశాలలో సుమారు 10 మంది సిబ్బంది, ముగ్గురు ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఆ రోజు మెనూ ప్రకారం భోజనం సిద్ధం చేసి, మూడు వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేస్తున్నామని వివరించారు.

అధికారులు డిజిటల్ వ్యవస్థ పనితీరును కూడా పరిశీలించారు. ప్రతి రోజు హాజరు నమోదు, వాహనాల జీపీఎస్ ట్రాకింగ్, పాఠశాలల్లో భోజనం అందిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వంటి ప్రక్రియలు పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భోజనం స్వీకరించిన అనంతరం హెడ్‌మాస్టర్లు మొబైల్ యాప్ ద్వారా నాణ్యతపై ఫీడ్‌బ్యాక్ అందించే విధానం అమల్లో ఉందని చెప్పారు.

మలబద్ధకం చిన్న సమస్య కాదు.. గట్ హెల్త్ బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం

ఆహార పదార్థాల నిల్వపై కూడా అధికారులు ఆరా తీశారు. బియ్యం తదితర సరుకులు ప్రభుత్వ సరఫరా కేంద్రాల నుంచి నేరుగా వస్తున్నాయని, ప్రస్తుతం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్వాహకులు వివరించారు.

వంట ప్రక్రియను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా బియ్యం నాణ్యతపై సూచనలు చేశారు. గంజి పూర్తిగా వంపేయకుండా, అవసరమైన నీటి పరిమాణంతో బియ్యాన్ని ఉడికిస్తే పోషకాలు ఎక్కువగా నిల్వ ఉంటాయని తెలిపారు. బిర్యానీ అన్నం మాదిరిగా గింజ విడివిడిగా ఉడికే విధంగా వండితే విద్యార్థులకు కూడా రుచిగా ఉంటుందని సూచించారు.

వంటశాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వంట సిబ్బంది జీతాలు, డ్రైవర్ల వేతనాలు, ఆటోల నిర్వహణ, డీజిల్ ఖర్చులు, గ్యాస్ వినియోగం వంటి వ్యయాలు అధికంగా ఉన్నప్పటికీ, అందుకు తగిన ఆర్థిక సహాయం అందడం లేదని తెలిపారు. ముఖ్యంగా మూడు పెద్ద గ్యాస్ బర్నర్లు నిరంతరం పనిచేయాల్సి రావడంతో గ్యాస్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటోందని చెప్పారు.

తెలంగాణలో ఒంటరి మహిళలకు శుభవార్త.. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు అమలు

ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పనిచేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థల విధానాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. వంట సిబ్బంది వేతనాలు, రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయాల అంశాలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైతే ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

స్మార్ట్ కిచెన్‌ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను సమగ్రంగా పరిశీలించి, సాధ్యమైన పరిష్కారాల కోసం కృషి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అచ్చం మగవారి గొంతుతో ఎస్. జానకి పాట! ఇంటర్వ్యూ విశేషాలు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *