Adaso Kapesa: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ, స్వదేశీ పర్యటనల్లో నల్లటి సూట్ ధరించి, అత్యంత అప్రమత్తతతో ఆయన వెనుక నీడలా నడిచే ఒక ధీరనారిని మీరు ఎప్పుడైనా గమనించారా ? దేశంలోనే అత్యున్నత మరియు సున్నితమైన భద్రతా వలయంలోకి అడుగుపెట్టి, చరిత్ర సృష్టించిన ఆమె పేరు అదాసో కపేసా (Adaso Kapesa)
మారుమూల గ్రామం నుంచి దేశ అత్యున్నత రక్షణ విభాగం వరకు:
- నేపథ్యం: అదాసో కపేసా మణిపూర్ రాష్ట్రం సేనాపతి జిల్లాలోని ‘కైబి’ అనే ఒక మారుమూల గ్రామానికి చెందిన ‘మావు నాగా’ గిరిజన కుటుంబంలో జన్మించారు.
- ప్రారంభ సర్వీస్: ఎస్పీజీ (SPG) లోకి రాకముందు ఆమె కేంద్ర హోమ్‌శాఖ ఆధ్వర్యంలోని ‘సశస్త్ర సీమా బల్’ (SSB)లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్ 55వ బెటాలియన్‌లో ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
ALSO READ: యువతలో గుండె ఆరోగ్యానికి రోజూ 10 నిమిషాల వ్యాయామం ఎందుకు ముఖ్యం?
హిస్టరీ క్రియేట్ చేసిన తొలి మహిళా కమాండో:
- చారిత్రక రికార్డు: 1985లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం కేవలం దేశ ప్రధాని భద్రత కోసమే ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్’ (SPG) ఏర్పడింది. దశాబ్దాలుగా పూర్తిగా పురుషులకే పరిమితమైన ఈ దళంలోకి అడుగుపెట్టిన తొలి మహిళా అధికారిగా అదాసో కపేసా సరికొత్త చరిత్ర సృష్టించారు.

- కఠినమైన శిక్షణ: క్లోజ్ క్వార్టర్ కాంబాట్ (సమీప పోరాటాలు), అత్యాధునిక ఆయుధాల నిర్వహణ, నిఘా మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాత్మక అంశాలలో ఆమె అత్యంత కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.
ALSO READ: KALAVAKUNTLA KAVITHA: సింగరేణి బకాయిలు చెల్లిస్తే కరెంట్ సమస్య ఉండదు.
లక్షలాది మంది యువతకు రోల్ మోడల్:
ఏలాంటి రాజకీయ లేదా విఐపి నేపథ్యం లేకుండా కేవలం స్వయంకృషి, నిబద్ధత, అంకితభావంతో ఒక మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి దేశ ప్రధానికే రక్షక కవచంగా మారిన అదాసో కపేసా, నేటి భారతావనిలో లక్షలాది మంది యువతులకు మరియు మహిళలకు(Adaso Kapesa) నిజమైన స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.
