ఆడుకున్న కుక్కే ప్రాణాలు తీసింది… రేబిస్ బారినపడి 12 ఏళ్ల బాలుడు మృతి.

ఆడుకున్న కుక్కే ప్రాణాలు తీసింది… రేబిస్ బారినపడి 12 ఏళ్ల బాలుడు మృతి.

అనకాపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. రేబిస్ సోకి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కుక్క గోళ్లతో రక్కిన గాయాన్ని నిర్లక్ష్యం చేయడంతో సకాలంలో వ్యాక్సిన్ వేయించుకోకపోవడమే ఈ విషాదానికి కారణమైంది.

అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామానికి చెందిన గుడియా పూర్ణానంద్ అనే బాలుడు దుప్పుతూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్న పూర్ణానంద్‌కు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేవు. తండ్రి మద్యానికి బానిసగా ఉండగా, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి పూర్ణానంద్‌నే సంరక్షణ అందించేవాడు.

Lord Venkateshwara Swamy: శ్రీవారి భక్తులకు ‘ఏఐ’ ఊరట: తిరుమలలో సక్సెస్ అయిన కొత్త టెక్నాలజీ!

ఆ కుటుంబంతో కలిసి ఒక వీధి కుక్క ఇంట్లోనే తిరుగుతూ ఉండేది. పూర్ణానంద్ రోజూ ఆ కుక్కతో ఆడుకుంటూ ఉండేవాడు. ఆ కుక్క కూడా బాలుడితో ఎంతో అనుకూలంగా మెలిగేది. అయితే ఆ స్నేహమే చివరకు బాలుడి ప్రాణాలు తీసే పరిస్థితికి దారితీసింది.

ఒకరోజు గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం అనిత బాలుడి కాలిపై గోళ్లతో రక్కిన గాయాలను గమనించి ప్రశ్నించారు. ఆడుకుంటున్న సమయంలో కుక్క రక్కినట్టు బాలుడు తెలిపాడు. అప్పటికే అతడు అస్వస్థతకు గురవుతున్నాడు. వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని ఏఎన్‌ఎం సూచించారు. అయితే కుక్క గోళ్లతో గాయం అయినా వ్యాక్సిన్ అవసరమనే విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోయినట్టు ఆమె వెల్లడించారు.

మగవారు తప్పకుండా త్రాగవలసిన డ్రింక్ ఇది.

దీంతో డిసెంబర్ 9న అచ్చుతాపురం పీహెచ్‌సీలో బాలుడికి మొదటి రేబిస్ వ్యాక్సిన్ వేశారు. తరువాత రెండో డోసు కూడా ఇచ్చారు. అయినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గ్రామస్తులు చందాలు సేకరించి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు.

రేబిస్ లక్షణాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో చిన వాల్తేరులోని మానసిక ఆరోగ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పూర్ణానంద్ మృతి చెందినట్లు ఏఎన్‌ఎం అనిత తెలిపారు.

టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.

పూర్ణానంద్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎప్పుడూ తనతో ఆడుకుంటూ ఉన్న కుక్కే తన ప్రాణాలకు కారణమవడం గ్రామస్తులను కలచివేసింది. కుక్క కరిచినా, గోళ్లతో రక్కినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *