టాలీవుడ్‌లో శివాజీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు హీరోగా వరుస చిత్రాల్లో నటించిన ఆయన, తిరిగి ఎంట్రీ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నటనతో పాటు బిగ్‌బాస్ షో ద్వారా మరింత గుర్తింపు సంపాదించిన శివాజీ, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘దండోరా’ సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.
పాతాళలోకం వినడమే గానీ ఎప్పుడైనా చూశారా?వైరల్ వీడియోలో బోరుబావి సాహసం.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్ల దుస్తుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. శరీర భాగాలు స్పష్టంగా కనిపించేలా దుస్తులు ధరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి వేషధారణను అందంగా భావించలేమని స్పష్టంగా చెప్పారు.
పురుషుల్లో టెస్టోస్టిరోన్ తగ్గుదలకి నేచురల్ పరిష్కారం – అత్తిపత్తి వేళ్ల పొడి ప్రయోజనాలు.
అమ్మాయిలను చూస్తే తల్లిని గుర్తు చేసుకోవాలి అన్న భావన తనదని, అలాంటి పవిత్రత చీరకట్టులో, సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుందని శివాజీ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు సౌందర్య, సావిత్రి లాంటి నటీమణులు చీరకట్టుతోనే ఇండస్ట్రీని ప్రభావితం చేశారని గుర్తు చేశారు. సంప్రదాయానికి కట్టుబడి ఉన్నప్పటికీ స్టార్‌డమ్ సాధ్యమేనని వారు నిరూపించారని తెలిపారు.
యువతలో కొత్త రిలేషన్ ట్రెండ్ – ‘హుష్ డేటింగ్’ అంటే ఏమిటి?
ప్రస్తుత తరం నటీమణుల్లో రష్మిక మందన్న లాంటి వారు పొట్టి దుస్తులు ధరించకుండానే భారీ విజయాలు సాధిస్తున్నారని ఉదాహరణగా పేర్కొన్నారు. అందుకే హీరోయిన్లు ఆధునికత పేరుతో చిన్న దుస్తుల వైపు వెళ్లకుండా, సంప్రదాయ వేషధారణను ప్రోత్సహించాలని సూచించారు. తన మాటలు కొందరికి ఇబ్బంది కలిగించవచ్చని అంగీకరిస్తూనే, వాటిని ఆచరణలో పెడితే సమాజానికి మేలు జరుగుతుందని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
డైలీ కాఫీ త్రాగే వారికి పెను ప్రమాదం!