జగిత్యాల జిల్లాలో ఓ వృద్ధురాలు ఎదుర్కొంటున్న సమస్యకు ఆమె స్వయంగా వినూత్న పరిష్కారం కనుగొన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు మలయాళ ఎక్స్ రోడ్ ప్రధాన రహదారి పక్కన చెట్టు కింద పండ్లు విక్రయిస్తున్న ఆమెకు కోతుల బెడద తీవ్ర ఇబ్బందిగా మారింది.
గుంపులుగా వస్తున్న కోతులు క్షణాల్లో పండ్లను ఎత్తుకెళ్తుండటంతో ఆమెకు భారీ నష్టం వాటిల్లేది. తెచ్చిన పండ్లలో దాదాపు సగం కోతుల పాలవడంతో రోజంతా కష్టపడినా కనీస ఆదాయం కూడా మిగలని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కుటుంబ పోషణ కోసం ఆమె పండ్ల వ్యాపారాన్ని కొనసాగించాల్సి వచ్చింది.
ALSO READ: యువకుల్లో అంగస్తంభన సమస్య.. గుండె జబ్బులకు ముందస్తు హెచ్చరిక
ఈ సమస్య నుంచి బయటపడేందుకు వృద్ధురాలు ఓ ఆలోచన చేశారు. పండ్లు అమ్ముకునే ప్రదేశం చుట్టూ వల ఏర్పాటు చేసుకుని, దాని లోపల కూర్చుని వ్యాపారం చేయడం ప్రారంభించారు. వినియోగదారులు వచ్చినప్పుడు వలను కొద్దిగా పక్కకు జరిపి పండ్లను విక్రయిస్తున్నారు.
ఈ వినూత్న ఏర్పాటుతో కోతుల బెడద నుంచి ఆమెకు కొంత ఉపశమనం లభించింది. వల అడ్డుగా ఉండటంతో కోతులు పండ్లను ఎత్తుకెళ్లడం కష్టంగా మారింది. సమస్యను ఎదుర్కొనేందుకు వృద్ధురాలు చేసిన ఈ చిన్న ప్రయత్నం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
ALSO READ: నీళ్లు లేకుండానే బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్.. టెక్నాలజీలో కొత్త విప్లవం!
