కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు వెళ్తుండగా ఆయన కాన్వాయ్ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లు సమాచారం.
రాహుల్ గాంధీ పరువునష్టం దావా కేసు విచారణ నిమిత్తం సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యేందుకు లక్నో విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో కాన్వాయ్‌లోని వాహనాలు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
ALSO READ: యువకుల్లో అంగస్తంభన సమస్య.. గుండె జబ్బులకు ముందస్తు హెచ్చరిక కావచ్చా?
ఈ ఘటనలో రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదని కాంగ్రెస్ నేతలు వెల్లడించినట్లు సమాచారం. అయితే కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రాహుల్ గాంధీ ప్రయాణాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన క్షేమంగా ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
పరువునష్టం కేసు విచారణ నేపథ్యంలో రాహుల్ గాంధీ సుల్తాన్‌పూర్ కోర్టుకు వెళ్లడం ఈ పర్యటనకు ప్రధాన కారణం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, గాయపడిన వారి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
