తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సనాతన హిందూ ధర్మ విస్తరణ లక్ష్యంగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు అవసరమైన మైక్ సెట్లు, గొడుగులు, విగ్రహాలను సబ్సిడీ ధరలకే అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అర్హులైన ఆలయాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఆసక్తి ఉన్న వారు నిబంధనల ప్రకారం పూర్తిగా నింపిన దరఖాస్తు పత్రాన్ని డిమాండ్ డ్రాఫ్ట్‌తో కలిసి కార్యనిర్వహణ అధికారి, టీటీడీ పరిపాలన భవనం, కేటీ రోడ్, తిరుపతి అనే చిరునామాకు పంపాలి. మరిన్ని వివరాల కోసం 08772-264276 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించింది.
టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.
మైక్ సెట్ల కొనుగోలుకు అయ్యే మొత్తం వ్యయం రూ.25,000గా నిర్ణయించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆలయాలకు 90 శాతం రాయితీ వర్తిస్తుంది. వీరు కేవలం 10 శాతం మాత్రమే, అంటే రూ.2,500 డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లిస్తే సరిపోతుంది. ఇతర వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు సగం ధరగా రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుతో పాటు ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, సంబంధిత ప్రాంత తహసీల్దార్ లేదా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిఫారసు లేఖ, ఆలయ ఫోటో, విద్యుత్ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్ కార్డు ప్రతులను జత చేయాల్సి ఉంటుంది.
చలికాలంలో ఇమ్మ్యూనిటి ని అమాంతం పెంచే డ్రింక్ ఇది.
అదేవిధంగా, హిందూ ఆలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా రూ.14,500 విలువైన గొడుగులను 50 శాతం రాయితీతో కేవలం రూ.7,250కే టీటీడీ అందించనుంది. అలాగే హిందూ దేవాలయాలకు అవసరమైన శేష వస్త్రాలను పూర్తిగా ఉచితంగా సరఫరా చేస్తారు. ఇందుకోసం ఆలయ అభ్యర్థన లేఖను కార్యనిర్వహణ అధికారి, తిరుపతి పేరుతో పంపాలి.
నూతనంగా నిర్మిస్తున్న ఆలయాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి రాతి విగ్రహాలను ఉచితంగా అందజేస్తారు. ఇతర దేవతల రాతి విగ్రహాల విషయంలో 75 శాతం సబ్సిడీ వర్తింపజేసి, మిగిలిన 25 శాతం ధర చెల్లించిన వారికి అందిస్తారు.
సోషల్ మీడియా పరిచయాలు మరో విషాదానికి దారి తీశాయి.