ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఎంత ధైర్యవంతులైన వారికైనా గుండె దడపడుతుంది. వైరల్ క్లిప్‌లో ఓ వ్యక్తి దాదాపు 1,000 అడుగుల లోతున్న బోరుబావిలోకి నెమ్మదిగా దిగుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఆ దృశ్యం చూస్తే అతడు పాతాళానికి దిగుతున్నట్లే అనిపిస్తుంది.
ఈ వీడియో కేవలం ఉత్కంఠభరితమైన అనుభూతిని మాత్రమే కాదు, నీటి కొరతతో అల్లాడుతున్న ప్రాంతాల నిస్సహాయ పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ క్లిప్ నెటిజన్ల మనసులను బలంగా కదిలిస్తోంది.తీవ్రమైన నీటి కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. ఫలితంగా బోర్వెల్లను 800 నుంచి 1,000 అడుగుల లోతు వరకు తవ్వాల్సి వస్తోంది. అంత లోతుల్లో అమర్చిన భారీ, శక్తివంతమైన పంపులకు రిపేర్ వచ్చినప్పుడు వాటిని పైకి లాగడం దాదాపు అసాధ్యం.
డైలీ కాఫీ త్రాగే వారికి పెను ప్రమాదం!
అటువంటి సందర్భాల్లో ధైర్యవంతులైన సాంకేతిక నిపుణులు గోలుసులు, తాళ్ల సహాయంతో ఇరుకైన, చీకటి నిండిన లోతైన రంధ్రాల్లోకి దిగి పంపులను మరమ్మతు చేస్తారు. ప్రజల దాహాన్ని తీర్చేందుకు వారు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియో సంచలనం సృష్టించింది. వీడియోలో ఒక టెక్నీషియన్ మెల్లగా చీకటిలోకి దిగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
దాదాపు 1,000 అడుగుల లోతుకు చేరుకున్నాక, చివరికి ఒక భారీ పంపు, దానితో పాటు ప్రవహిస్తున్న నీటి ధార కనిపిస్తుంది. అంత లోతుల్లో ఆక్సిజన్ కొరత, యంత్రాల వైఫల్యం వంటి ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఈ పని ఎంత ప్రాణాంతకమో ఊహించుకోవడమే భయంకరంగా ఉంది. ఈ వీడియోను ఇప్పటికే 15 మిలియన్లకు పైగా మంది వీక్షించగా, 3.5 లక్షల మందికిపైగా లైక్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. “అయ్యో! ఇది చూస్తుంటేనే నాకు క్లాస్ట్రోఫోబియా వస్తోంది.
యువతలో కొత్త రిలేషన్ ట్రెండ్ – ‘హుష్ డేటింగ్’ అంటే ఏమిటి?
నేను లోపలికి వెళ్లి ఉంటే భయంతోనే ప్రాణాలు పోయేవి,” అని ఒకరు కామెంట్ చేశారు.
“ఈ వ్యక్తి నిజంగానే పాతాళానికి వెళ్లినట్టుంది,” అని మరొకరు అన్నారు.
“ఈ వీడియోను ఎవరు, ఎలా చిత్రీకరించారు? అంత లోతులో కెమెరా ఎలా పని చేసింది?” అని ఇంకొక వినియోగదారుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మొత్తానికి, ఈ వీడియో ధైర్యం, ప్రమాదం, అలాగే నీటి కోసం మనిషి చేసే పోరాటాన్ని స్పష్టంగా చూపిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
దోమలు మీ దరి చేరకుండా చేసే 5 రకాల మొక్కలు ఇవే.