
Ram Charan : మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోలలో ఛాలెంజింగ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.మామూలు క్యారక్టర్ రోల్స్ లో కంటే ఆయన ఛాలెంజింగ్ రోల్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నాడు. ఎక్కడా కూడా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. చాలా సహజంగా నటిస్తున్నట్టు ఉంటుంది. అందుకు ఉదాహరణగా నిల్చింది ‘రంగస్థలం’ చిత్రం.
ఇందులో ఆయన చెవిటివాడిగా ఎంత సహజంగా నటించాడో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ యాక్టింగ్ గురించి ప్రస్తావన వస్తే ‘రంగస్థలం’ లో రామ్ చరణ్ రేంజ్ లో నటించాడు అని పోలుస్తూ మాట్లాడుతారు. అంత అద్భుతంగా నటించాడు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం విడుదల అవ్వలేదు కానీ, అయ్యి ఉంటే నేషనల్ అవార్డు కూడా వచ్చేదని విశ్లేషకుల అభిప్రాయం.

రంగస్థలం తర్వాత వచ్చిన #RRR లో కూడా ఆయన వివిధ షేడ్స్ లో చాలా సహజంగా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ లో ‘అప్పన్న’ క్యారక్టర్ ని ఎంత అద్భుతంగా పోషించాడో మనమంతా చూసాము. ఈ క్యారక్టర్ లో ఆయన నత్తివాడిగా చాలా సహజంగా నటించాడు. ఆయన నటిస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. ఈ క్యారక్టర్ ని సెకండ్ హాఫ్ లో కాస్త పెంచి ఉండుంటే బాక్స్ ఆఫీస్ వద్ద అలాంటి డిజాస్టర్ ఫలితాన్ని అందుకునేది కాదు.
రామ్ చరణ్ ఈ క్యారక్టర్ లో నటించలేదు, జీవించాడు అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చి బాబు తో రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ గురించి ఒక షాకింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అదేమిటంటే ఇందులో రామ్ చరణ్ గుడ్డివాడిగా నటిస్తున్నాడట.

గుడ్డివాడు అయినప్పటికీ ఆటల్లో అతని ఊరిలోనే మొనగాడు అని, ఏ ఆటలో అయినా అతన్ని ఓడించేవారు లేరని తెలుస్తుంది. ఈ క్యారక్టర్ ద్వారా అనేక ఎమోషన్స్ ని పలికించేలా డైరెక్టర్ బుచ్చి బాబు స్క్రిప్ట్ ని రాసుకున్నాడట. రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూడొచ్చని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కం బ్యాక్ ఇస్తే ఏ రేంజ్ లో ఉంటుందో గతంలో మనమంతా చూసాము. ఇప్పుడు మరోసారి చూడబోతున్నాము అంటూ ఈ చిత్రానికి సంబంధించిన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.