సీతమ్మను అపహరించిన రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేయించుకుని 11 వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడని రామాయణం చెబుతుంది. కష్టాలు, కరువులు లేని ఆ పాలననే “రామరాజ్యం”గా ప్రజలు గుర్తిస్తారు. అయితే శ్రీరాముడికి అయోధ్యతో పాటు మరో నగరం కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.
Cancer: రాత్రిపూట లేటుగా అన్నం తినే వారికి క్యాన్సర్ వస్తుందా?
త్రేతాయుగంలో ఆదర్శ మానవుడిగా జీవించిన శ్రీరాముడికి అరేబియా సముద్ర తీరంలో, మహారాష్ట్ర కొంకన్ ప్రాంతంలో మరో నగరం ఉందని స్థానికుల నమ్మకం. 2004 సునామి తర్వాత అరేబియా సముద్ర గర్భం నుంచి కొన్ని పురాతన అవశేషాలు, విగ్రహాలు బయటపడటంతో ఈ కథకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సింధుదుర్గ్ జిల్లా మాల్వన్–టర్కర్లీ ప్రాంతంలో సముద్రంలో స్కూబా డైవింగ్ చేసినప్పుడు ఒక ఋషి విగ్రహం, స్తంభాల అవశేషాలు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు.
Cancer: రాత్రిపూట లేటుగా అన్నం తినే వారికి క్యాన్సర్ వస్తుందా?
ఆ విగ్రహాన్ని మహర్షి అగస్త్యుడిగా గుర్తిస్తున్నారు. పురాణాల ప్రకారం అగస్త్యమునికి కొంకన్ ప్రాంతంతో బలమైన అనుబంధం ఉంది. ఆయన సముద్రపు నీటిని తాగి రాక్షసులను సంహరించాడనే కథలు విష్ణు పురాణంలో ఉన్నాయి. అదే సమయంలో సముద్ర గర్భంలో ఒక నగరాన్ని నిర్మించి తపస్సు చేశాడని స్థానికుల విశ్వాసం. ఆ నగరమే శ్రీరాముడికి సంబంధించిన మరో రాజ్యమని వారు అంటున్నారు.
Geetha Madhuri: యూరియా వేసే పరికరం తయారు చేసిన విద్యార్థి గీతా మాధురి.
ఈ అవశేషాలు నిజంగా రామాయణ కాలానికి చెందినవేనా? లేక ప్రకృతి మార్పుల వల్ల బయటపడిన పురాతన నిర్మాణాలేనా? అన్నది ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే సముద్ర గర్భంలో కనిపిస్తున్న ఈ సిధిలాలు కొంకన్ ప్రాంత చరిత్రకు, పురాణాలకు కొత్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరింత పరిశోధన జరిగితే శ్రీరాముడి మరో రాజ్యం గురించిన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Herbal Drink for Headaches:ఔషధ శక్తి దాగి ఉన్న హెర్బల్ టీ ఇది