ఒకప్పుడు మన తాతలు, తండ్రుల కాలంలో ఒకసారి పెళ్లి జరిగితే జీవితాంతం కలిసి ఉండేవారు. బంధాలు సహజంగా కొనసాగేవి. కానీ మారుతున్న కాలంతో పాటు జీవన శైలులు, ఆలోచనలు మారిపోయాయి. ఈ రోజుల్లో బంధాలు కలకాలం నిలవాలంటే పెద్ద పోరాటమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇగోలు, భారీ ఉద్యోగాలు, ఆర్థిక స్వాతంత్ర్యం, లగ్జరీ జీవితం… ఇవన్నీ కలిసి జంటల మధ్య దూరాలను పెంచుతున్నాయి. రెండు నిమిషాల్లో మ్యాగీ తయారయ్యేలా, ఇన్‌స్టంట్‌గా బంధాలు ఏర్పడటం, అలాగే విడిపోవడాలు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
దోమలు మీ దరి చేరకుండా చేసే 5 రకాల మొక్కలు ఇవే.
ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ యువత మధ్య ఒక కొత్త పదం హాట్ టాపిక్‌గా మారింది. అదే ‘హుష్ డేటింగ్’. ప్రేమ, స్నేహం, బంధాల విషయంలో గతానికి భిన్నంగా, అత్యంత గోప్యంగా సాగే ఈ కొత్త రిలేషన్‌షిప్ స్టైల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హుష్ డేటింగ్ అంటే ఏమిటి?
పేరులోనే ఉన్నట్టు, ఎవరికీ తెలియకుండా – సోషల్ మీడియాలో హడావుడి లేకుండా, కనీసం సన్నిహిత మిత్రులకు కూడా చెప్పకుండా కొనసాగించే డేటింగ్ విధానమే హుష్ డేటింగ్. ఇందులో కమిట్‌మెంట్‌కి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ప్రైవసీకి అత్యంత విలువ ఇవ్వడమే దీని ప్రధాన లక్షణం. ‘నో లేబుల్ రిలేషన్‌షిప్’ అన్న భావన ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం హెచ్చరిక!
హుష్ డేటింగ్ ఎందుకు పెరుగుతోంది?
నేటి వేగవంతమైన జీవనశైలిలో యువత ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది.
‘ఎప్పుడు పెళ్లి?’, ‘ఎవరితో తిరుగుతున్నావ్?’ వంటి ప్రశ్నలు, సమాజపు తీర్పుల నుంచి తప్పించుకోవాలనే ఆలోచన చాలా మందిని ఈ రహస్య మార్గం వైపు నడిపిస్తోంది. కెరీర్, వ్యక్తిగత ఎదుగుదలకి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో బంధాలకు పేర్లు పెట్టకుండా ఉండాలని భావిస్తున్నారు. ప్రతి విషయం ప్రపంచానికి ప్రకటించడం కంటే, వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడమే సురక్షితమని అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
హుష్ డేటింగ్ ఎలా ఉంటుంది?
సాధారణ డేటింగ్‌తో పోలిస్తే దీనిలో కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, ఫేస్‌బుక్ స్టేటస్‌లు ఉండవు. కలిసి దిగిన ఫొటోలు పోస్ట్ చేయరు. ఒకరిపై ఒకరికి పెద్దగా అంచనాలు ఉండవు. దాంతో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. రద్దీగా ఉండే పబ్లిక్ ప్రదేశాల కంటే ఏకాంతంగా ఉండే చోట్లకే ప్రాధాన్యం ఇస్తారు. ‘మన బంధానికి పేరు ఏంటి?’ అనే ప్రశ్నను వీలైనంతవరకు దాటవేస్తారు.
హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గి గుండె ఆరోగ్యం పెరగాలంటే….
హైదరాబాద్ యువత ఏమంటోంది?
ఐటీ రంగం, స్టార్టప్ కల్చర్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో ఆధునిక భావనలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
‘జీవితాన్ని ఆస్వాదించాలి, వెంటనే బంధాలకు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు’ అని కొందరు అంటుంటే,
‘సీక్రెట్ రిలేషన్‌షిప్స్ కంటే స్పష్టత ఉన్న బంధాలే మనసుకు ప్రశాంతత ఇస్తాయి’ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
చివరగా…
హుష్ డేటింగ్ అనేది మారుతున్న కాలానికి, మారుతున్న మనుషుల ఆలోచనలకు ప్రతిబింబం. కొందరికి ఇది సౌకర్యంగా అనిపించవచ్చు. కానీ సరైన అవగాహన లేకపోతే భావోద్వేగపరమైన సమస్యలకు దారితీయే అవకాశం కూడా ఉంది. ఏ బంధమైనా పరస్పర గౌరవం, స్పష్టత ఉండటం చాలా ముఖ్యం. ట్రెండ్‌ను గుడ్డిగా అనుసరించడం కంటే, మన మనసుకు ఏది సరైనదో ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే నిజమైన పరిణతి.