తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తూ, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయిన రైతు యాంత్రికరణ పథకాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు సబ్సిడీపై రైతులకు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష 31 వేల మంది రైతులకు ఈ పథకం ద్వారా లాభం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
చలికాలంలో ఇమ్మ్యూనిటి ని అమాంతం పెంచే డ్రింక్ ఇది.
2026 జనవరిలో రైతు యాంత్రికరణ పథకాన్ని అధికారికంగా పునఃప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి సమర్థవంతంగా అమలు చేసే భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకం పునరుద్ధరణతో రాష్ట్రంలోని రైతులకు ఆధునిక సాంకేతికత చేరువై, వ్యవసాయ ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆహార భద్రత మిషన్‌లో భాగంగా సబ్సిడీపై పప్పుధాన్యాల విత్తనాలు అందించినట్లు మంత్రి గుర్తు చేశారు.
మీ గుడి మీద మైక్ లేదా? ఈ టీటీడీ ఆఫర్ మీకే .
రైతు యాంత్రికరణ పథకానికి సంబంధించి జనవరిలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే నెలలో ప్రక్రియను పూర్తిచేసి, అర్హులైన రైతులకు యంత్రాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అదేవిధంగా, గ్రామస్థాయిలో పథకాల అమలుపై స్పష్టత కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సబ్సిడీలు, యూరియా యాప్, యాంత్రికరణ పథక దరఖాస్తులపై రైతుల నుంచి సమాచారం సేకరించాలని, ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు సూచించాలని అధికారులకు ఆదేశించారు.
టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.
అలాగే రైతుల ఆదాయం పెంచే దిశగా ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పిస్తూ, అందుబాటులో ఉన్న సబ్సిడీల వివరాలు తెలియజేసి ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని మంత్రి పేర్కొన్నారు.