బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎంత బంగారం కొనగలిగామో ఇప్పుడు అంత కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు, కోట్ల ఆదాయం ఉన్నవారు బంగారం కొనగలుగుతున్నా, కష్టపడి బతికే పేదలకు మాత్రం బంగారు షాపు దగ్గరకు వెళ్లడమే భయంగా మారిందని చెబుతున్నారు.
Akhira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కుమారుడు అకీరా నందన్.
పెళ్లిళ్లు, శుభకార్యాల్లో కనీసం పసుపు తాడు, మెట్టెలు, చిన్న ఆభరణాలు కూడా కొనలేని పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. బంగారం ధరలు పెరగడంతో పాటు చోరీలు, దాడులు కూడా పెరిగాయని, ముఖ్యంగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసులు లాక్కెళ్లే ఘటనలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోల్ గోల్డ్, ఇత్తడి కూడా దొంగలకు బంగారంలానే కనిపిస్తోందని అంటున్నారు.
Akhira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కుమారుడు అకీరా నందన్.
బంగారం రేట్లు పెరగడం వల్ల సమాజంలో అసమానతలు మరింత పెరుగుతున్నాయని, విద్యార్థులు, యువత కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోవడంతో జీవనం భారంగా మారిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బంగారం ధరలపై నియంత్రణ తీసుకురావాలని, సామాన్య ప్రజలు గౌరవంగా బతికేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Cancer: రాత్రిపూట లేటుగా అన్నం తినే వారికి క్యాన్సర్ వస్తుందా?
Geetha Madhuri: యూరియా వేసే పరికరం తయారు చేసిన విద్యార్థి గీతా మాధురి.