Goat and Sheep: కీసరలో మేకలు–గొర్రెల ర*క్తం అక్రమ సేకరణ బట్టబయలు: ఇద్దరు అరెస్ట్, 130 ప్యాకెట్లు స్వాధీనం:
కీసర పరిధిలో మేకలు, గొర్రెల(Goat and Sheep) నుంచి నిబంధనలకు విరుద్ధంగా రక్తం సేకరిస్తున్న ముఠాను గుర్తించినట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. విషయం వెటర్నరీ శాఖతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
Gmail: జీమెయిల్ వాడుతున్నారా..? 2026 లోఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్.
పోలీసుల ప్రాథమిక విచారణలో సేకరించిన రక్తాన్ని కాచిగూడలోని సీఎన్‌కే ల్యాబ్‌కు తరలిస్తున్నట్లు తేలింది. రక్తం సేకరణ పూర్తిగా అక్రమమని, వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి అయినప్పటికీ నకిలీ వెటర్నరీ డాక్టర్ ద్వారా ఈ పని చేస్తున్నట్లు డీసీపీ చెప్పారు. అంతేకాకుండా, తీసిన రక్తాన్ని చికెన్ షాప్‌లోనే అనధికారికంగా నిల్వ చేస్తున్నారని వివరించారు. రక్తాన్ని ఏ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు, క్లినికల్ ట్రయల్స్ ఎలా నిర్వహిస్తున్నారు అనే అంశాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.

మగవారు తప్పకుండా త్రాగవలసిన డ్రింక్ ఇది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం సత్యనారాయణ కాలనీలోని ‘సోను చికెన్ అండ్ మటన్ షాప్’లో మేకలు, గొర్రెల నుంచి వైద్య ప్రమాణాలు పాటించకుండా రక్తం(Goat and Sheep) సేకరిస్తున్నారని సమాచారం అందడంతో కీసర పోలీసులు ఆదివారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని సుందర్ సోను, ఉద్యోగి అఖిల్‌ను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 130 ప్యాకెట్ల రక్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆడుకున్న కుక్కే ప్రాణాలు తీసింది… రేబిస్ బారినపడి 12 ఏళ్ల బాలుడు మృతి.
సేకరించిన రక్తాన్ని(Goat and Sheep) కాచిగూడలోని సీఎన్‌కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు పంపించి, అక్కడ ల్యాబ్‌లలో ప్లేట్‌లెట్లు తయారీకి వినియోగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వైద్య పర్యవేక్షణ లేకుండా రక్తం తీసుకోవడం వల్ల మేకలు ఒక్క రోజులోనే మృతి చెందుతున్నాయని పోలీసులు తెలిపారు. రక్తం తీసిన మేకలను చంపి మటన్‌గా విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించినట్లు చెప్పారు. జంతువులపై ఇలాంటి అమానుష చర్యలు చట్టవిరుద్ధమని, జంతు సంక్షేమ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? అది ఎందుకు ప్రమాదకరం?