Gmail: జీమెయిల్ వాడుతున్నారా..? 2026 లోఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్.

Gmail: జీమెయిల్ వాడుతున్నారా..? 2026 లోఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్.

Gmail: జీమెయిల్ వాడుతున్నారా..? 2026 లోఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్:

ఇటీవలి కాలంలో ఈమెయిల్(Gmail) ప్రతి ఒక్కరి జీవితంలో కీలక అవసరంగా మారింది. ఉద్యోగులు ఆఫీస్ పనుల కోసం, వ్యాపారులు తమ బిజినెస్ అవసరాల కోసం ఈమెయిల్‌ను తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా ఫైల్స్ భద్రపరచుకోవడం, విద్యాసంబంధిత సమాచారాన్ని పంపుకోవడం వంటి అవసరాలకు మెయిల్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే ఈమెయిల్ సేవల్లో జిమెయిల్ ముందంజలో ఉంది.

పేరులోనే ఉందా అదృష్టం? వైకుంఠ ద్వార దర్శన టోకెన్లలో ఆసక్తికర విశేషం.

Google అందించే జిమెయిల్(Gmail) చాలా కాలంగా మార్కెట్లో ఉండి, సులభమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. యాహూ, ఔట్‌లుక్ వంటి ఇతర మెయిల్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నప్పటికీ, జిమెయిల్‌కు అలవాటుపడిన వారు ఎక్కువగానే ఉన్నారు. యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు గూగుల్ తరచూ కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది. తాజాగా మరో ఆసక్తికరమైన ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంతవరకు జిమెయిల్(Gmail) ఐడీ క్రియేట్ చేసిన తర్వాత యూజర్ నేమ్‌ను మార్చుకునే అవకాశం లేదు. చిన్న వయసులో లేదా తొందరపాటులో క్రియేట్ చేసుకున్న పేరు పెద్దయ్యాక నచ్చకపోయినా మార్చుకునే వెసులుబాటు ఉండేది కాదు. అందుకే చాలా మంది కొత్తగా మరో జిమెయిల్ ఐడీ సృష్టించుకుని, పాత ఐడీని డేటా కోసం కొనసాగించేవారు.

మగవారు తప్పకుండా త్రాగవలసిన డ్రింక్ ఇది.

ఇప్పుడు ఆ సమస్యకు గూగుల్ పరిష్కారం చూపించింది. జిమెయిల్‌లో యూజర్ నేమ్ మార్చుకునే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గూగుల్ సపోర్ట్ పేజీలో ఈ ఆప్షన్ ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే ఒకసారి యూజర్ నేమ్ మార్చుకున్న తర్వాత, మళ్లీ మార్చుకోవాలంటే ఏడాది పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా, జీవితకాలంలో గరిష్టంగా మూడు సార్లు మాత్రమే జిమెయిల్ యూజర్ నేమ్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, త్వరలో అందరికీ విడుదల చేయనున్నట్లు సమాచారం. యూజర్ నేమ్ మార్చుకున్నా కూడా మీ జిమెయిల్‌లోని డేటా, మెయిల్స్ అన్నీ యథాతథంగా ఉంటాయి. చివరలో ఉండే “@gmail.com” మారదు, దానికి ముందు భాగం మాత్రమే మీరు మార్చుకోవచ్చు. ఒక వ్యక్తికి రెండు పేర్లు ఉన్నట్లే, ఇప్పుడు జిమెయిల్‌(Gmail)కు కూడా ఒకే అకౌంట్‌లో రెండు యూజర్ నేమ్స్ ఉండేలా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేశారు.

టీచర్‌తో అనుచిత సంబంధం ఆరోపణలు.. భర్తను బెదిరించిన పోలీస్ కానిస్టేబుల్.

 పొట్టలో బ్యాక్టీరియా పెరిగితే హార్ట్ ఎటాక్ వస్తుందా ?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *