
fast news
కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు క్షోరకళలో రోజు రోజుకి డెవలప్ అవుతున్నారు కొత్త కొత్త ఎత్తులతో అమాయకులను బకరాలని చేసి దోచేస్తున్నారు తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది కొందరు దుండగులు ఓ వ్యక్తికి రోడ్డు మీద వంద రూపాయలు చూపించి అతని బైక్ లో నుంచి లక్షన్నర కొట్టేసి పారిపోయారు ఆ తర్వాత విషయం గ్రహించి లవోదిమంటూ ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణంలోని బ్యాంకు నుంచి శ్రీహరి అనే వ్యక్తి తన సొంత అవసరాల కోసం ₹150000 డ్రా చేసుకున్నారు తన ద్విచక్ర వాహనాల్లో ఈ డబ్బును పెట్టుకున్నారు. ఇదంతా
కొందరు వ్యక్తులు గమనించారు శ్రీహరి బ్యాంకు వెళ్లడం డబ్బు డ్రా చేయటం అది తీసుకొచ్చి తన బైక్ లో పెట్టుకోవడం అన్ని పరిశీలించారు ఈ గేటుగాళ్ళు శ్రీహరి కూడా బ్యాంకు నుంచి బయటకు వచ్చి చుట్టూ ఏమీ గమనించలేదు అక్కడ ఉన్న వారంతా బ్యాంకు వచ్చిన కస్టమర్లే అనుకుని మామూలుగా డబ్బు సంచి బైక్ లో పెట్టుకొని బయలుదేరబోయాడు ఇంతలో ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చారు ఓ వ్యక్తి కొంచెం దూరంగా ఉండి ఫోన్ మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేశాడు మరో వ్యక్తి శ్రీహరి దగ్గరకు వచ్చి అక్కడ ₹100 రూపాయలు పడి ఉన్నాయి మీనేమో చూసుకోండి అని చెప్పాడు. అటు తిరిగి చూసిన శ్రీహరి తనదై
ఉంటుందని నోటు తీసుకోవడానికి అటు వంగగా శ్రీహరి బైక్ కి అవతల ఉన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి శ్రీహరి బైక్ పైన పెట్టిన డబ్బు సంచి తీసుకున్నాడు అప్పటికి అక్కడ మరో వ్యక్తి బైక్ స్టార్ట్ చేసుకుని రెడీగా ఉన్నాడు డబ్బు సంచితో ఆ ఇద్దరు అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు ఇటువైపు ఉన్న మరో ఇద్దరు 100 నోటు ఆ పక్కనే ఉన్న బైక్ కింద ఉంది చూడండి అని శ్రీహరికి చెప్పారు ఆయన అటు తిరగగానే వీరిద్దరూ కూడా బైక్ పై ఉడాయించారు అక్కడ నోటు ఏమీ కనిపించకపోయేసరికి శ్రీహరి తిరిగి తన బైక్ దగ్గరికి వచ్చాడు కానీ ఆయనకు తన డబ్బు సంచి కనిపించలేదు.
దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు ఇలా శ్రీహరి ₹100 రూపాయల కోసం చూసుకుని లక్షన్నర పోగొట్టుకున్నాడు పోలీసులు బ్యాంకు సంబంధించిన సిసీ కెమెరాలతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న సిసీ కెమెరాలను పరిశీలించారు దీంతో దొంగల భాగవతం మొత్తం బయటపడింది ఆ రికార్డులు స్వాధీనం చేసుకొని దొంగ పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు ఈ మధ్య బ్యాంక్ సమీపంలో ఇలాంటి దొంగతనాలు పెరిగిపోతున్నాయని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.