Balapur Ganesh Laddu Auction:బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. రూ.39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి 2026.

Balapur Ganesh Laddu Auction
Balapur Ganesh Laddu Auction

Balapur Ganesh Laddu Auction: హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం మరోసారి భక్తుల్లో ఉత్కంఠను రేకెత్తించింది. బాలాపూర్ గ్రామంలోని బొడ్రాయి వద్ద శుక్రవారం నిర్వహించిన ఈ వేలంలో సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు 21 కిలోల గణేష్ లడ్డూను దక్కించుకున్నారు. వేలం ప్రారంభమైనప్పటి నుంచి పలువురు పోటీ పడటంతో కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.

ప్రత్యేక పూజలతో ప్రారంభమైన వేడుకలు

శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు బాలాపూర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజనలు, భక్తి గీతాల నడుమ స్వామివారిని గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి బొడ్రాయి వద్దకు చేర్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఊరేగింపు ఆలస్యమవడంతో లడ్డూ వేలం కార్యక్రమం కూడా నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైంది.

ALSO READ: అధిక నెలసరి రక్తస్రావం తగ్గించుకోవచ్చా? 25% Sperm Count ని రెండు వారాల్లో పెంచే పొడి ఇది.

వేలాది మంది భక్తుల సమక్షంలో ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి వేలం పాటను ప్రారంభించారు.

తొమ్మిది మంది మధ్య హోరాహోరీ పోటీ

ఈ ఏడాది లడ్డూ వేలంలో(Balapur Ganesh Laddu Auction)మొత్తం తొమ్మిది మంది ప్రధానంగా పాల్గొన్నారు. సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, చంపాపేటకు చెందిన మర్రి రవికిరణ్ రెడ్డి, కందాడ శాలిని వీరేందర్ రెడ్డి, హస్తినాపురానికి చెందిన కంచర్ల శివారెడ్డి, సామ దయానంద్ రెడ్డి, సామ వరానంద్ రెడ్డి, గడ్డం నవీన్ రెడ్డి, బాలాపూర్‌కు చెందిన ఇబ్రాం ప్రత్యూష్, రితున్ రెడ్డి వేలంలో పోటీ పడ్డారు.

Balapur Ganesh Laddu Auction

రూ.1,016 ప్రారంభ ధరతో మొదలైన వేలం క్రమంగా పెరుగుతూ ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలతో లడ్డూను సొంతం చేసుకున్నారు.

ALSO READ: The Paradise Movie Review: నాని మాస్ అవతార్ ఎలా ఉంది? కథ, నటన, ప్లస్‌లు, మైనస్‌లు 2026.

బాలాపూర్ లడ్డూ వేలంలో(Balapur Ganesh Laddu Auction) మరోసారి సామ ప్రణీత్ రెడ్డి

21 కిలోల బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి ఈ వేలంలో విజేతగా నిలిచారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రతి ఏడాది భక్తుల దృష్టిని ఆకర్షిస్తుండగా, ఈసారి కూడా భారీ ధర పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భక్తులు వేలం కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. గణనాథుడి లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా భావించే భక్తులు వేలంలో పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.

Related Post