భూదాన్ ఉద్యమం పేదల కోసం ఆస్తిని సమకూర్చాలనే మహత్తర లక్ష్యంతో మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆచార్య వినోబా భావే ప్రారంభించినదని కేటీఆర్ పేర్కొన్నారు. భూమిలేని వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి, సాగు చేసుకోవడానికి భూమి అందించాలనే సంకల్పంతో ఆ ఉద్యమం సాగిందన్నారు. వినోబా భావే పేరుతో కాలనీలు ఏర్పడటం కూడా ఆ చరిత్రకు నిదర్శనమని తెలిపారు.
శృం***గార సామర్థ్యాన్నిపెంచే పౌడర్ ఇది.
అయితే ప్రస్తుతం కొన్ని వర్గాలు గాంధీ పేరు ఉపయోగించుకుంటూ భూదాన్ భూములపై కన్నేశాయని కేటీఆర్ ఆరోపించారు. పేదల కోసం కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. భూదాన్ భూములు పేదల ఆస్తి అన్న విషయాన్ని గుర్తుంచుకుని వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిదని ఆయన స్పష్టం చేశారు.
సముద్ర గర్భంలో శ్రీరాముని మరో రాజ్యం.