సంక్రాంతి అంటే చాలా మందికి పండగ అనే తెలుసు….ఆ రోజు ప్రత్యేకత చాలా మందికి తెలియదు. అసలు సంక్రాంతి రోజు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసిన ఆ కుటుంబం చాలా వృద్ధిలోకి వస్తుంది.
ఈ రోజు దాన ధర్మాలకు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజున నువ్వులతో చేసిన పిండి వంటలు దానం చేసిన లేదా దానం పొందిన ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈ రోజున పెరుగు దానం చేస్తే చాలా మంచిది. మరి ముఖ్యంగా మకర సంక్రాంతి రోజు ఆ మహా శివుడికి రుద్రాభిషేకం చేస్తే ఆ కుటుంబం కి ఆర్థిక సమస్యలు ఉండవని ప్రతీక. మరిన్ని వివరాలు ఈ కింది వీడియో లో చూడండి.