
ఈ మధ్య చాలా మంది మీద సినిమాలు, వెబ్ సీరీస్ ల ప్రభావం ఎక్కువగానే కనపడుతుంది. అయితే సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచన మనిషిని ఎంతగా దిగజరుస్తుందో కదా. అయితే ఈ వ్యక్తి సులువు గా డబ్బులు సంపాదించాడానికి అని ఏ వీడియోలు చూశాడో కానీ ఓ వ్యక్తి ఏకంగా పెద్ద గోల్డ్ షోరూంనే టార్గెట్ చేశాడు. కానీ ప్రాపర్ గా వర్కవుట్ చేయకపోవడం నగలు దోచుకున్న తరువాత ఎక్కడికి వెళ్లాలో తెలియకపోవడంతో దొరికిపోయాడు.
అది కూడా మామూలు పోలీసులకు కాదు ట్రాఫిక్ పోలీసులకు దొరికేశాడు. అయితే ఈ ఘటన కాకినాడ జిల్లా కేంద్రం లో జరిగినది. కాకినాడ మెయిన్ రోడ్లో తనిష్క్ బంగారు ఆభరణాల షోరూం ఉంది. మధ్యాహ్నం సమయంలో కస్టమర్లు ఎవరూ లేరు. ఆ సమయలో ఓ యువకుడు వచ్చాడు. ఒక గోల్డ్ చైన్ కావాలని చూపించమని అడిగాడు. సేల్స్ గర్ల్ వెంటనే కొన్ని మోడల్స్ చూపించింది. అన్నింటిని తన చేతుల్లోకి తీసుకున్న ఆ వ్యక్తి వెంటనే అతని జేబులో నుంచి తుపాకీ తీసి కదిలితే కాల్చేస్తానని బెదిరించాడు.
సేల్స్ గర్ల్ బెదిరిపోవడం తో అక్కడి నుండి బయటపడ్డాడు దొంగ. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి బంగారంతో పారిపోతున్న దొంగను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి తుపాకీతో పాటు దోచుకున్న బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగ వద్ద ఉన్న తుపాకీ ఒరిజినల్ కాదు అని పోలీసులు తేల్చారు. అనంతరం దొంగను కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb