Viral Video:కోర్టు హాల్‌లో భార్య దాడి.. నవ్వుతూ తప్పించుకున్న భర్త.. వైరల్ వీడియో వెనుక షాకింగ్ కథ:
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోర్టు హాల్‌లోనే భార్య భర్తపై చేయి చేసుకోవడం, జుట్టు పట్టుకుని కొట్టడం, బూతులు తిట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ ఘటనలో అసలు ట్విస్ట్ ఏంటంటే… భార్య దాడి చేస్తూనే ఉంటే, భర్త మాత్రం నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపించాడు.
“నువ్వు దొంగవు… నీకు దొంగ తెలివి ఎక్కువ” అంటూ భార్య భర్తను అవమానించింది. అందుకు భర్త నవ్వుతూ “ఈ తెలివంతా నువ్వే నేర్పావు. ఇప్పుడు విడాకులు వచ్చాయి, ఇక దొబ్బేయ్” అంటూ సమాధానం(Viral Video) ఇచ్చాడు. ఈ సంభాషణలతో కూడిన వీడియో కర్ణాటకలో మొదట వైరల్ కాగా, ఆ తర్వాత దేశమంతా దీనిపై నవ్వులు పూయించారు.
Gandham Podi:డల్ గా వాడిపోయిన ముఖాన్ని మెరిసేలా చేసే ప్యాక్ ఇది.
ఈ వీడియో వెనుక ఉన్న కథ మరింత ఆసక్తికరంగా ఉంది. వీరిద్దరికీ మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తుండగా, భర్త మాత్రం చిన్న ఉద్యోగం చేసేవాడు. రెండు సంవత్సరాల నుంచే వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. భర్తకు మంచి ఆస్తి ఉండటంతో, భార్య విడాకుల పేరుతో ఆస్తిలో వాటా దక్కించుకోవాలని ప్లాన్ వేసిందని కథనం.

భర్తపై గృహహింస కేసులు పెట్టిన భార్య, ఆస్తిలో వాటా ఇస్తే కేసులు ఉపసంహరిస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం కోర్టు (Viral Video)ద్వారా భారీ భరణం రాబట్టాలని ప్రయత్నించింది. నెలకు ఆరు లక్షల రూపాయలు భరణం కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో భర్త షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని నెలవారీ ఆదాయం అంతకంటే చాలా తక్కువ.
చెల్లెమ్మ అంటూనే వంచన.. ఖమ్మం ప్రమీల ఘటనపై సంచలన నిజాలు!
అక్కడే భర్త ఓ వ్యూహం అమలు చేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి, తన పేరు మీద ఉన్న ఆస్తులను తల్లి పేరుపై మార్చేశాడు. తాను నిరుద్యోగినని, అనారోగ్యంతో బాధపడుతున్నానని, తల్లే తనను పోషిస్తోందని కోర్టులో వాదించాడు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆస్తులు తల్లి పేరుపై ఉండటంతో, కోర్టులో అతని వాదన నిలబడింది.
రెండేళ్ల పాటు కేసు నడిచిన తర్వాత, న్యాయస్థానం భార్యకు ఊహించని షాక్ ఇచ్చింది. “నీవే నెలకు లక్షన్నర సంపాదిస్తున్నప్పుడు నీకు భరణం ఎందుకు? భర్తకు ఉద్యోగం లేదు, ఆస్తులు కూడా అతని పేరుపై లేవు. అతను ఎలా భరణం ఇవ్వగలడు?” అంటూ కోర్టు ప్రశ్నించింది. చివరకు భర్త భరణం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది.
చలికాలంలో ఆరోగ్యం: ఒంట్లో రక్తాన్ని, వేడిని పెంచే చిట్కాలు.
ఈ తీర్పు విన్న భర్త నవ్వుతూ కోర్టు నుంచి బయటకు వచ్చాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేని భార్య ఆగ్రహంతో భర్తపై దాడి చేసింది. అదే దృశ్యాలు వీడియో(Viral Video)గా రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భర్త మాత్రం “నీ తెలివే నాకు వచ్చింది” అంటూ దెబ్బలు తింటూనే నవ్వాడు.
ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి పెళ్లిళ్ల కంటే విడాకులే మంచివేమో అంటూ కొందరు వ్యాఖ్యానిస్తే, మరికొందరు ఇద్దరి వ్యవహారాన్ని విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో(Viral Video) సంచలనంగా మారింది.ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
Winter Skin Care: చంకలు గజ్జల్లో దురదలను తగ్గించే చిట్కా.
అమెరికాలో భారతీయుడి గొప్ప మనసు: నిరుపేద జంట ఆకలి తీర్చి నెటిజన్ల మనసు గెలుచుకున్న నోవా.