టీవీకే అధినేత, నటుడు Vijay కుటుంబ జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య Sangeetha Sornalingam చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. వివాహ బంధంలో నమ్మకం దెబ్బతిన్నదని, ఇతర మహిళలతో సంబంధాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2021 నుంచి తనను, పిల్లలను నిర్లక్ష్యం చేశారని కూడా ఆమె ఆరోపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
శృం***గార సామర్థ్యాన్నిపెంచే పౌడర్ ఇది.
1999లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గత ఏడాది నుంచి విడాకులపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు కావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల రాజకీయ వేదికలపై వ్యక్తిగత ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
డూప్లికేట్ గాంధీలు పేదల భూముల కబ్జాకు యత్నిస్తున్నారు.
కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై విజయ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.