టాలీవుడ్ నటుడు సుబ్బరాజు తెలుగుతో పాటు తమిళ, మళయాళం, హిందీ భాషల్లో సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించాడు. సుబ్బరాజు ఎక్కువగా విలన్ వేషాలు వేసినప్పటికీ కొన్ని చిత్రాల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఆయన 47 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడు అయ్యాడు. ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
నటుడు సుబ్బరాజు పెళ్లి ఫోటోను షేర్ చేశారు కానీ వధువుకు సంబంధించిన విషయాలను షేర్ చేయలేదు. ఆయన పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి. సుబ్బరాజు బాహుబలి 2 సినిమాలో పోషించిన కుమార వర్మ పాత్రకు మంచి ప్రశంసలు దక్కడంతో సుబ్బరాజును జపాన్ ప్రేక్షకులకు సైతం చేరువ చేశాయి. జపాన్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.. ఆ తర్వాత ఎన్నో పాత్రల్లో నటించిన నటుడు సుబ్బరాజు సంవత్సరానికి నాలుగు అయిదు సినిమాలు చేస్తున్నారు. అయితే దాదాపు విలన్‌గా ఆయన మరిన్ని పాత్రలు చేయాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.
సుబ్బరాజు భార్యతో కలిసి బీచ్ ఒడ్డున దిగిన ఫోటో షేర్ చేశారు నటుడు సుబ్బరాజు. పెళ్లి బట్టల్లో వారిద్దరు చూడ చక్కగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కృష్ణవంశీ ఇంట్లో కంప్యూటర్ రిపేర్ చేయడం కోసం వెళ్లి ఖడ్గం సినిమాలో అవకాశం దక్కించుకున్నారు సుబ్బరాజు. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో 2003లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఖడ్గం’లో చిన్న పాత్రలలో కనిపించడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఒక్క సినిమా తోనే మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అదే సంవత్సరంలో రిలీస్ అయిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలోనూ నటించడంతో మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు సుమారు 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడీ స్టార్ యాక్టర్. హీరో సుబ్బరాజు పెళ్లి విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb