ఒకప్పుడు మొబైల్ రీచార్జ్ అంటే చిన్న కార్డ్ తీసుకొచ్చి దానిపై ఉన్న నంబర్లను గీకి ఫోన్లో టైప్ చేసి రీచార్జ్ చేసుకునే రోజులు ఉండేవి. ఐదు, పది రూపాయల రీచార్జ్ చేస్తే కొద్దిగా బ్యాలెన్స్ వచ్చేది. అప్పుడు అవసరం ఉంటేనే మాట్లాడేవారు. లేకపోతే ఒక “మిస్ కాల్” ఇచ్చి కట్ చేసేవారు. ఇంటర్నెట్ కావాలన్నా 10 లేదా 20 రూపాయల చిన్న ప్యాకేజీలు తీసుకునేవాళ్లు.
ఇప్పుడు కాలం మారిపోయింది. అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అంటూ పెద్ద ప్యాకేజీలు వస్తున్నాయి. బయటకు చూస్తే ఇవన్నీ వినియోగదారులకు చాలా బాగానే కనిపిస్తాయి. కానీ ఇందులో మరో లెక్క దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు.
వేస్ట్ నుంచి బెస్ట్..కొబ్బరి పీచుతో లక్షల్లో ఆదాయం.
మనందరికీ ఒక సంవత్సరం అంటే 12 నెలలు. కానీ టెలికాం కంపెనీలు మాత్రం నెలను 30 లేదా 31 రోజులు కాకుండా 28 రోజులుగానే పరిగణిస్తున్నాయి. అంటే మనం ఒక నెల రీచార్జ్ చేసుకున్నా అది కేవలం 28 రోజులకే ముగుస్తుంది. ఈ లెక్క ప్రకారం ఏడాదిలో 12 రీచార్జ్‌లకు బదులు 13 సార్లు రీచార్జ్ చేయాల్సి వస్తుంది.
ఈ విషయంపై పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. శివసేన పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, “సంవత్సరంలో 12 నెలలు మాత్రమే ఉన్నా 28 రోజుల రీచార్జ్ విధానం వల్ల వినియోగదారులు 13 సార్లు రీచార్జ్ చేయాల్సి వస్తోంది. ఇది ప్రజలపై అదనపు భారం పెడుతోంది” అని వ్యాఖ్యానించారు.
నరాలని బ్రెయిన్ ని డిటాక్స్ చేసే ఫుడ్ ఇదే.
ఇప్పటి రోజుల్లో మొబైల్ ఫోన్ లేకుండా జీవితం సాగడం చాలా కష్టం. యూపీఐ చెల్లింపులు, బ్యాంకింగ్ ఓటీపీలు, ట్రైన్ టికెట్లు, ఆధార్ ధృవీకరణ, ఉద్యోగ ఇంటర్వ్యూలు, ఆస్పత్రి కాల్స్ – ఇలా అనేక ముఖ్యమైన పనులు మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. అలాంటి సమయంలో రీచార్జ్ లేకపోతే ఫోన్ పూర్తిగా పనిచేయకుండా చేయడం సరైనదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
దేశంలో కోట్లాది మంది మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఎక్కువ మంది ప్రీపెయిడ్ వినియోగదారులే. వీరు ప్రతి నెలా రీచార్జ్ చేస్తూ ఉంటారు. కానీ 28 రోజుల వ్యవస్థ వల్ల తెలియకుండానే అదనంగా ఒక నెల రీచార్జ్ చేయాల్సి వస్తోందని విమర్శలు వస్తున్నాయి.
మా ప్రభుత్వం వచ్చాక మహిళల పేరు మీదే పథకాలు ఇస్తున్నాం..
ఇది వినియోగదారుల హక్కులకు సంబంధించిన అంశమని కొందరు అభిప్రాయపడుతున్నారు. కనీసం రీచార్జ్ లేకపోయినా ఇన్కమింగ్ కాల్స్ మాత్రం కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి నెలను 28 రోజులుగా పరిగణించే విధానం వల్ల టెలికాం కంపెనీలు కోట్ల రూపాయల అదనపు ఆదాయం పొందుతున్నాయని చర్చ జరుగుతోంది.