
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుజాతికి వన్నె తెచ్చిన అగ్రగణ్యుల్లో నందమూరి తారక రామారావు గారు ఒకరు.ఇక సినిమా ఇండస్ట్రి మొదలుకొని తెలుగు జాతి మొత్తం ఆయన పేరు వింటేనే ఆశేషమైన అభిమానం ఉప్పొంగుతుంది. తెలుగు ప్రజలను గర్వపడేలా ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం సాగింది. నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రాలు ఇప్పటికీ అందరి మదిలో నిలిచిపోతుంటాయి. ఆయన నటుడిగానే కాకుండా దర్శకుడిగాను, నిర్మాతగాను పలు సినిమాలు తీశారు. ఇక అతని నటనా ప్రావీణ్యంతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
ఆయన కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమానాన్ని పొందారు. ఆయన జీవిత కాలంలో ఎక్కువ రోజులు సినిమాలు చేస్తూనే ప్రేక్షకులను అలరించారు. 1966లో ఎన్టీయార్ ముఖచిత్రం ‘విజయచిత్ర’ద్వారా ప్రచురించబడింది. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాఠకుల కోసం ఓ లేఖ రాయాలని పబ్లిషర్ రావి కొండల రావు కోరగా అందుకు అన్నగారు ఓకే అన్నారట..మీ చేతి రాత బాగుంటుందని మీరు రాస్తే పాఠకులు సంతోషిస్తారని అనడంతో తప్పకుండా బ్రదర్ అని చెప్పారట.. అలా మూవీ షూటింట్లో దొరికిన ఖాళీ సమయంలో మూడు పేజీల్లో పాఠకుల కోసం తన కలం నుంచి పదాలను జారవిడిచారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన చేతిరాత వైరల్ అవుతుంది. ఆయన చేతి రాత ముత్యాల్లాంటి అక్షరాలు, ఎక్కడా తప్పుల్లేని వాక్యాలు, ఓ రచయిత రాసినట్టుగా రాసిన వ్యాఖ్యానాలు, వివరణలు… ఆయన విజయచిత్ర అనే పత్రిక ద్వారా పాఠకులకు ఆయన రాసిన లేఖ ఇది. అయితే ఆనాటి ప్రతులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ రాతను చూసి నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మీరు చదివి ఎలా ఉన్నాయో మీ విలువైన కామెంట్ చేయండి.


