
NTR KOWSHIK:ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ మృతి.
NTR KOWSHIK: గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న కౌశిక్ అనే ఎన్టీఆర్ వీరాభిమాని చనిపోయాడు. కౌశికక్ ‘దేవర సినిమా ‘ రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చాడు. అయితే కౌశిక్ తల్లి అభ్యర్థన మేరకు స్వయంగా హీరో ఎన్టీఆర్ వీడియో కాల్ కూడా మాట్లాడాడు. ప్రస్తుతం ఆ అభిమాని ఇంట్లో విషాదం నెలకొంది.
అయితే కౌశిక్ బోన్ మ్యారో మార్పిడికి జూనియర్ ఎన్టీఆర్,రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయగా బోన్ మ్యారో మార్పిడి చేయించుకున్నాడు. కానీ ఆపరేషన్ ఫలించి చక్కగా ఇంటికి తిరిగి వచ్చిన కౌశిక్ ఇంతలోనే అకస్మాత్తుగా మరణించాడు. అయితే క్యాన్సర్‌తో ఆస్పత్రి బెడ్ పై ఉండి కూడా ఎన్టీఆర్‌తో తన చిరకాల కోరిక దేవర సినిమా చూసాకే కన్నుమూస్తానంటూ అప్పట్లో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.(NTR KOWSHIK)
వీరాభిమాని మాట్లాడిన వీడియో హీరో ఎన్టీఆర్ దృష్టికి వెళ్లగా అభిమాని కోరిక మేరకు ఎన్టీఆర్ వీడియో కాల్‌లో మాట్లాడి కౌశిక్ ని పరామర్శించాడు. నువ్వు త్వరలోనే కోలుకుంటావు. నీ కోసం నేను ఆ దేవుడిని ప్రార్థిస్తాను. మేమంత నీతోనే ఉంటాం. ధైర్యంగా ట్రీట్‌మెంట్ తీసుకో.. వీలు చూసుకుని త్వరలోనే నేను నిన్ను కలుస్తాను.(NTR KOWSHIK)
నువ్వు పూర్తిగా కోలుకున్నాక నీతో కలిసి దేవర మూవీ చూస్తాను చూద్దాం అంటూ మరణంతో పోరాడుతున్న అభిమాని ముఖంలో చిరునవ్వు తెప్పించారు. అంతేకాదు అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి క్యానర్స్‌తో పోరాడే ధైర్యం ఇచ్చారు. అతడి చికిత్సకు కూడా ఆర్థిక సాయం అందించారు. కౌశిక్ క్యాన్సర్ చికిత్స కోసం ఎన్టీఆర్ అభిమానులు కూడా విరాళాలు అందించారు.(NTR KOWSHIK)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb