MPDO Office Rent Issue:ప్రభుత్వ కార్యాలయానికే దిక్కులేదు.. అద్దె బకాయిలతో రోడ్డున పడ్డ అధికారులు.
రాంపాక నారాయణ అనే వ్యక్తి పెద్దంగమర ఎక్స్ రోడ్‌లో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్ (MPDO Office Rent Issue)భవనం యజమాని. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, గత 30 నెలలుగా ఆఫీస్ అద్దె చెల్లింపులు నిలిచిపోయాయి. ఇంటి/ఆఫీస్ రెంట్‌గా సుమారు రూ. 2,10,000 బకాయి ఉండగా, అదనంగా రూ. 76,000కు పైగా కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈ మొత్తం క్లియర్ అయ్యేంతవరకు ఆఫీస్‌ను అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు.
Natural Weight Loss Foods: బరువును త్వరగా తగ్గించే ఫుడ్స్ ఇవే.
తాను పెద్ద వంగర అర్జన కులానికి చెందిన నిరుపేద వ్యక్తినని పేర్కొంటూ, ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో మీడియా మిత్రులు, జిల్లా పరిషత్ సీఈవో, కలెక్టర్, అలాగే ఎంసీ రామకృష్ణరావు గారితో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులకు విన్నవించుకుంటున్నట్లు తెలిపారు.(MPDO Office Rent Issue)
Viral Video:కోర్టు హాల్‌లో భార్య దాడి.. నవ్వుతూ తప్పించుకున్న భర్త.. వైరల్ వీడియో వెనుక షాకింగ్ కథ!
బకాయి అద్దె మరియు కరెంట్ బిల్లులు పూర్తిగా చెల్లించిన తర్వాత ఆఫీస్(MPDO Office Rent Issue)ను ఎక్కడికి మార్చుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అప్పటివరకు మాత్రం ఆఫీస్ ఖాళీ చేసే ప్రసక్తే లేదని రాంపాక నారాయణ స్పష్టం చేశారు. పై అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి, ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా సమాచారం అందించి, తక్షణమే బిల్లులు క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.