
ప్రస్తుతం ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నా గ్రామంలో జరిగింది. తాజాగా ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నేటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే పాట్నాకు చెందిన నకుల్ శర్మ అనే వ్యక్తితో ఇంద్ర కుమారి కి 2022 సంవత్సరంలో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. నకుల్ శర్మకు మద్యం తాగే అలవాటు ఉండడంతో నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. ఈ విషయం ఇంద్ర కుమారి తన తల్లిదండ్రులకు చెప్పిన వారు సర్దుకు పొమ్మని సలహా ఇవ్వడంతో…. ఇంద్ర కుమారి చిత్ర హింసలను భరించలేక ఇంటికి లోన్ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది.
నకుల్ శర్మ బ్యాంకు లోన్ తీసుకోగా…లోన్ రికవరీ ఏజెంట్ తరచూ డబ్బు వసూలు కోసం ఇంటికి వస్తూ పోతూ ఉండడంతో అతనికి తన కష్టం చెప్తూ అతి త్వరగా అతనికి దగ్గర అయిపోయింది. వీరిద్దరూ ఒకరికొకరు ఇష్టపడి ఇద్దరి తల్లిదండ్రుల సమక్షంలో ఈ నెల 11వ తారీఖున ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ పెళ్లిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.