సర్కారు పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటే చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికీ సందేహపడుతుంటారు. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి అయినా ప్రైవేట్ స్కూల్‌కి పంపాలని భావించే వారు ఉన్నారు. సర్కారు పాఠశాలలో చదివించమని ఎవరు సలహా ఇచ్చినా, “అక్కడ పాఠశాల స్థాయి ఎలా ఉంటుంది?” అనే ప్రశ్నలు ఎదురవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
ఇటీవల ఒక సర్కారు పాఠశాల వద్ద కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా రిలీజ్ రోజునలా భారీగా జనాలు క్యూలు కడుతున్నారు. అయితే ఇది సినిమా టికెట్ల కోసం కాదు, సర్కారు పాఠశాలలో అడ్మిషన్ కోసం. ఈ ఆసక్తి ఎందుకు అంటే, ఆ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలే కారణం.
షుగర్ ఉన్నవారికి నీరసం తగ్గి షుగర్ కంట్రోల్ అవ్వాలంటే…
ఈ పాఠశాలలో ఏసీ గదులు, డిజిటల్ క్లాసులు, ఐఐటీ ఫౌండేషన్, యోగా, క్రీడలు, సర్టిఫికేట్ కోర్సులు వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. గత సంవత్సరం విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపగా, ఈసారి మరింత మందిని పంపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
మొత్తం 600 సీట్లు ఉన్న ఈ పాఠశాలకు ఇప్పటికే 4000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రతి సీటుకు సుమారు 10 మంది పోటీ పడుతున్నారు. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ పాఠశాల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషి చేసి, అన్ని సదుపాయాలతో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు.
పదవి తొలగింపు పై రాఘవ్ చద్దా సంచలన రియాక్షన్.
దీంతో మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ వంటి ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ఈ సర్కారు పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ పరిణామం చూస్తే సర్కారు పాఠశాలలపై ఉన్న అభిప్రాయం మారుతోంది. సరైన సదుపాయాలు, నాణ్యమైన విద్య ఉంటే ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్కూల్స్‌కు తగ్గట్టుగా నిలుస్తాయని ఈ ఉదాహరణ చెబుతోంది.
