Hero RamCharan:రామ్ చరణ్ ఇంట్లో ప్రత్యేక బిర్యానీ విందు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Hero RamCharan)నివాసంలో తాజాగా ఒక ప్రత్యేకమైన బిర్యానీ విందు జరిగింది. ఇది సాధారణ పార్టీ కాదు. ఎందుకంటే ఆ బిర్యానీని వండింది జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ప్రఖ్యాత చెఫ్ తకమాసా ఒసావా, అభిమానుల మధ్య ‘బిర్యానీ ఒసావా’గా పేరొందిన వ్యక్తి.
ప్రపంచవ్యాప్తంగా తన వంటక శైలితో గుర్తింపు తెచ్చుకున్న ఒసావా, ఈసారి స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి రామ్ చరణ్(Hero RamCharan), గర్భిణిగా ఉన్న ఉపాసన కోసం ఘుమఘుమలాడే సంప్రదాయ దేశీ బిర్యానీని సిద్ధం చేశాడు.
జనవరి 5 రామ్ చరణ్ ఇంటికి వచ్చిన ఒసావా, ఆరుబయట కట్టెల పొయ్యిపై పాతకాలపు విధానంలో బిర్యానీ వండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం అదే బిర్యానీని రామ్ చరణ్, ఉపాసన, సురేఖలకు ఆయనే స్వయంగా వడ్డించారు.

ఈ విందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తకమాసా ఒసావా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకోగా, రామ్ చరణ్ (Hero RamCharan)కూడా తన ఇంట్లో జరిగిన ఈ ప్రత్యేక బిర్యానీ పార్టీ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ దృశ్యాలు నెట్టింట వేగంగా వైరల్ అయ్యాయి.
Body Detoxification Drink: ఒంట్లో పేరుకుపోయిన కెమికల్స్ క్లీన్ అవ్వాలంటే.
ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్(Hero RamCharan) ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gmail: జీమెయిల్ వాడుతున్నారా..? 2026 లోఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్.