ఇంట్లో చీమలు, బొద్దింకలు, బల్లులు తిరుగుతుంటే ఇబ్బందిగా అనిపించడం సహజం. కానీ ఈ చిన్న సమస్యే ఒక వివాహిత ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచేసుకుని ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
అమీన్‌పూర్‌లోని శర్వా హోమ్స్‌లో భర్త శ్రీకాంత్, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్న మనీషాకు చీమలంటే అసహ్యంగా భయం. ఆమెకు ఇది సాధారణ భయం కాదు — మానసిక సమస్యగా మారిపోయింది. ఈ భయం తీవ్రంగా పెరగడంతో వైద్యులను కూడా సంప్రదించారు. వారు కొన్ని సూచనలు ఇచ్చినా పరిస్థితి క్రమంగా మరింత దిగజారింది.
ఇంట్లో చీమలు కనిపించడమే మనీషాకు భయానక అనుభూతిగా మారింది. చుట్టుపక్కల వారు దీనిని హేళన చేయడం, తన భయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోకపోవడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. చివరికి భరించలేక ఆమె భర్త ఆఫీస్‌కి వెళ్లిన సమయంలో బెడ్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ముక్కకుండ మోషన్ కి సులువుగా వెళ్ళాలి అంటే ఇలా చేయండి.
మరణానికి ముందు రాసిన లేఖలో “చీమలకు భయపడుతూ ఇక జీవించడం నాకు సాధ్యం కాదు. చనిపోతున్నాను. మన కూతురిని జాగ్రత్తగా చూసుకో” అని భర్తకు రాసి ఉంచింది.సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన శ్రీకాంత్ బెడ్రూం తలుపు మూసి ఉందని గమనించి లోపలికి వెళ్లగా, మనీషా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. షాక్‌కు గురైన ఆయన వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు.
వార్త అందుకున్న పటాన్చెరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లేఖను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన వినిన ప్రతీ ఒక్కరూ “ఓ చీమల భయమే ప్రాణాన్ని తీసుకుపోయిందా!” అంటూ విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫోబియా వంటి మానసిక సమస్యలను చిన్నచూపు చూడకూడదనే మరోసారి ఇది చాటిచెప్పింది.