పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు మరియు ఎల్‌పిజి (LPG) సరఫరాపై వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని, సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని అధికారులు వెల్లడించారు.
గ్యాస్ కొరత లేదు:
దేశంలోని రిఫైనరీల వద్ద తగినంత పెట్రోలియం స్టాక్ ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఎల్‌పిజి పంపుల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేవని, గ్యాస్ కొరత అనే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చింది. ఎల్‌పిజి అవుట్‌లెట్లతో పాటు పిఎన్‌జి (PNG) మరియు సిఎన్‌జి (CNG) సరఫరా కూడా యధావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.
నరాలని బ్రెయిన్ ని డిటాక్స్ చేసే ఫుడ్ ఇదే.
వాణిజ్య వినియోగదారులకు కీలక సూచన:
కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్లను ఉపయోగించే వారు వీలైనంత వరకు పిఎన్‌జి (పైప్‌డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్లకు మారాలని ప్రభుత్వం సూచించింది. ఆసక్తి ఉన్నవారు పిఎన్‌జిఆర్‌బి (PNGRB) ద్వారా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు.
సముద్ర మార్గాల్లో భద్రత మరియు అప్రమత్తత:
విదేశాల నుంచి వచ్చే చమురు నౌకల భద్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డ్రోన్లు లేదా ఇతర దాడుల నుండి నౌకలను రక్షించడానికి సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. షిప్పింగ్ సంస్థలు డిజి షిప్పింగ్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చే మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.
వేస్ట్ నుంచి బెస్ట్..కొబ్బరి పీచుతో లక్షల్లో ఆదాయం.
పోర్టుల పనితీరు సజావుగా..
భారతదేశంలోని అన్ని ప్రధాన ఓడరేవులు (Major Ports) మరియు ఇతర పోర్టుల కార్యకలాపాలు సుస్థిరంగా సాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి పోర్టులో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) అమలులో ఉందని, ఇంధన దిగుమతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.
వినియోగదారులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని, ఇంధన సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందే 3 ఆహారాలు.