
balagma movie mogilayya
తెలుగు చిత్ర పరిశ్రమ లో విషాదం నెలకొంది. బలగం సినిమా తో ఫేమ్ అయి చిత్ర పరిశ్రమ లో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాలు గా మొగిలయ్య ఆయన భార్య కొమురమ్మ బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బలగం సినిమాతో వీరికి మంచి పేరు వచ్చింది. జానపద కళాకారుడు, బలగం చిత్రంలో క్లైమాక్స్ పాటతో అందరి మనసులు దోచుకున్న మొగిలయ్య కన్ను మూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగులయ్య వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో కన్ను మూశారు.
నేటి ఉదయం మొగిలయ్య కన్నుమూశారు. తెలంగాణ పల్లె వాతావరణానికి దగ్గరగా జబర్దస్త్ ఫేమస్ కమేడియన్ వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం సినిమా తెలుగు ఇండస్ట్రీలో బంఫర్ విక్టరీ సాధించింది. అయితే బలగం మూవీ క్లైమాక్స్ పాటతో మెుగిలయ్య కోట్లాది మంది హృదయాలను కరిగించేశాడు.కుటుంబంలో మరుగునపడిపోయిన మానవ సంబంధాల విలువను వివరిస్తూ బలగం సినిమా లో మొగిలయ్య దంపతులు అద్భుతంగా పాట ఆలపించారు.
‘తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొమురయ్యా’ అంటూ సాగే ఆ పాట సినిమా చూసిన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. ఇక బలగం మూవీ మెుత్తం ఒకెత్తయితే.. క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాట మరో ఎత్తు అని చెప్పవచ్చు. మొగిల్లయ్య మరణంతో పలువురు బుర్రకథ కళాకారులు, సినీ ప్రముఖులు బలగం మొగిలయ్యకు నివాళులు అర్పిస్తున్నారు.

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb