
ap government good news
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పౌరులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనుంది.అయితే మంత్రివర్గ సమావేశంలో ఈ హెల్త్ పాలసీ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది.దీనిలో ఎన్టీఆర్ వైద్య సేవతోపాటు అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించనున్నారు.
అయితే ఈ హెల్త్ పాలసీని పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి అమలు చేయాలని ఏపీ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రం లోని 1.63 కోట్ల కుటుంబాలకు.. ఆరోగ్య బీమాను కల్పించేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణను తయారు చేసింది. అయితే ఈ హెల్త్ సేవలను 2,493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకురానుంది. ఈ హైబ్రిడ్ విధానం లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,257 రకాల వ్యాధులకు ఉచిత ట్రీట్మెంట్ ప్రజలకు అందించనున్నారు.
అయితే ఆరోగ్య బీమాను అప్లై చేసుకున్న 6 గంటల్లోనే ట్రీట్మెంట్కు అనుమతులు వచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ కోసం చర్యలు చేపట్టారు. రూ.2.5 లక్షలలోపు ఉన్న ట్రీట్మెంట్లకు సంబంధించిన క్లెయిమ్లు.. ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఇక రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లించనుంది. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.43 కోట్ల పేద కుటుంబాలతోపాటు.. 20 లక్షల మంది మధ్య తరగతి, ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని వర్తింపజేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.