రోడ్లు లేని కాలంలోనే నాన్నగారు ఇక్కడికి వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించడం నిజంగా అద్భుతం. ఆ రోజుల్లో ఉన్న సవాళ్లను తలచుకుంటే ఆశ్చర్యమే కలుగుతుంది. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా తెలుసు — అన్నపూర్ణ స్టూడియోస్ వల్ల ఎంతోమంది టెక్నీషియన్లు, నటులు, దర్శకులు తమ కెరీర్‌కి ఆరంభం ఇచ్చుకున్నారు. ఇది నిజంగా అనేక మంది జీవితాలకు ఆధారం అయింది.
ఆ రోజుల్లో ఈ ప్రదేశం గుట్టలతో, చెట్లతో నిండి ఉండేది. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత కష్టపడ్డారో ఊహించలేము. ఆయన స్వయంగా ప్రతి రాయి, ప్రతి మూలను సరిచేసి, ఇంత అందమైన స్టూడియోగా తీర్చిదిద్దారు.
ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది — ఇది ఒక గర్వకారణం. ఈ స్టూడియోకు “అన్నపూర్ణ” అనే పేరు రావడం వెనక ఉన్న కారణం కూడా ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. “అన్నపూర్ణ” అంటే మా అమ్మగారి పేరు. నాన్నగారు ఎప్పుడూ “ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుంది” అని నమ్మేవారు. ఆయన విజయానికి ప్రేరణ మా అమ్మగారేనని భావించి ఈ స్టూడియోకు ఆమె పేరునే పెట్టారు.
సీజన్ మారినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
ప్రతి సారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారు, నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ స్టూడియోలోని ప్రతి మూల కూడా వాళ్ల ఆత్మీయతను గుర్తు చేస్తుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ 1975లో ప్రారంభమై, 1976 జనవరి 14న రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు మరియు ఆయన భార్య చేతులమీదుగా అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమను స్థిరపరచాలనే సంకల్పంతో నాన్నగారు హైదరాబాదులో ఈ స్టూడియోను నెలకొల్పారు.
75 ఏళ్ల వృద్ధుడు 35 ఏళ్ల యువతిని పెళ్లాడి మరుసటి రోజు తెల్లవారుజామున మృతి చెందిన సంఘటనలో షాకింగ్ ట్విస్ట్.
ఏఎన్ఆర్ గారు ఎల్లప్పుడూ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. అందుకే అన్నపూర్ణ స్టాఫ్‌ను “స్టాఫ్ ఫ్యామిలీ” కాకుండా “అన్నపూర్ణ ఫ్యామిలీ” అని పిలుస్తారు. ఈరోజు స్టూడియో ఇంత చైతన్యంతో నిండిపోయి ఉండటానికి కారణం వాళ్లే. వాళ్లందరూ “అన్నపూర్ణ వారియర్స్”. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
50 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజున స్టూడియో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతి రోజు నాన్నగారు, అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు. ఆ ఆనవాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈ చిన్న పనితో బ్రెయిన్ రిఫ్రెష్… బాడీలో ఫ్యాట్ దూరం.
నాన్నగారు నా జీవితానికే కాదు — మా కుటుంబానికీ, ఇంకా బయట ఉన్న అనేక మందికీ ఒక గొప్ప ప్రేరణ. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ గర్వంగా, ఆనందంగా ఫీలవుతారు. ఆయన జీవితం నిజంగా ఒక ఇన్స్పిరేషన్.