
ac repair
హరియాణాలోని ఫరీదాబాద్ లో ఘోర విషాదం జరిగింది. ఓ ఇంట్లో ఏసీ పేలి ముగ్గురు చనిపోయారు. అర్ధరాత్రి 1:30 గంటలకు ఏసీ పేలడంతో కుటుంబ సభ్యులు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ప్రజలు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. అయితే కొన్నేళ్ల క్రితం పట్టణాలు , ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో, ధనికుల ఇండ్లల్లో మాత్రమే ఏసీలు కనిపించేవి. ప్రస్తుతం గ్రామాల్లోకి కూడా ఏసీలు వచ్చేశాయి.
ప్రతి సంవత్సరం పెరిగిపోతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు కూడా ఇంట్లో చల్లని వాతావరణం కోసం ఏసీలకు అలవాటుపడపోయారు. ప్రస్తుతం ఓ ఇంట్లో ఏసీ పేలిపోయిన ఘటన సంచలనంగా మారింది. ఈ షాకింగ్ హరియాణాలో ఘటన జరిగింది. కుటుంబం మొత్తం నిద్రిస్తుండగా ఏసీ పేలిపోయి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. కుటుంబ సభ్యులతో పాటు కుక్క కూడా మృతి చెందింది. ఒకరు మాత్రం బ్రతికారు.
Also Read :ఇంట్లో చెత్త పారేస్తున్నారు ! మరి బాడీలో చెత్త ఎలా ?
అయితే చనిపోయిన వారిని సచిన్ కపూర్, అతని భార్య రింకూ కపూర్, వారి కూతురు సుజన్ కపూర్గా పోలీసులు గుర్తించారు. మరణించిన ముగ్గురూ ఒకే గదిలో నిద్రిస్తుండగా.. సచిన్ కపూర్ కొడుకు వేరొక గదిలో నిద్రిస్తున్నాడు. అందువల్లే అతనికి తప్పించుకునే అవకాశం ఉండటం తో రూమ్ నిండా పొగలు కమ్ముకోగానే భయంతో రూంలోని కిటికీ నుంచి బయటకు దూకేశాడు.
అయితే అతను రెండవ అంతస్తు నుండి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. పెద్ద శబ్దంతో ఏసీ పేలిందని స్థానికులు తెలిపారు. ఫోర్త్ ఫ్లోర్ లో ఏడుగురితో ఉన్న కుటుంబం నివసిస్తుందని.. థర్డ్ ఫ్లోర్ను సచిన్ కపూర్ తన ఆఫీస్గా వినియోగించుకుంటున్నాడని పొరుగున ఉండే మయాంక్ తెలిపాడు. ఏసీ ఎలా పేలింది అనే కారణాలు తెలియాల్సి ఉంది.
ఏసీలు పేలడానికి అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏసీ లోని కంప్రెషర్ వేడెక్కడం వల్ల పేలుడు సంభవించే అవకాశం ఉంది. అది ఎక్కువ సమయం పనిచేసి, బ్రేక్ లేకుండా కొనసాగితే వేడి ఎక్కువగా వస్తుంది. ఈ వేడిమి పెరిగినప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
Also Read: రక్తంలో సోడియం ఎక్కువ ఉంటే ఏం చేయాలి ?
ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
ఏసీలను ఉపయోగించేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఫిల్టర్లను మార్చడం, అవుట్ డోర్ యూనిట్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చూసుకోవడం, కంప్రెషర్ చుట్టూ తగినంత ఖాళీ ఉండేలా చేయడం, ఓవర్ లోడ్ కాకుండా చూసుకోవడం చేయాలని చెబుతున్నారు.
Also Read: నరాలు స్ట్రాంగ్ గా అయ్యి బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే | Rich Omega 3 Seeds