వేస్ట్ నుంచి బెస్ట్..కొబ్బరి పీచుతో లక్షల్లో ఆదాయం.

వేస్ట్ నుంచి బెస్ట్..కొబ్బరి పీచుతో లక్షల్లో ఆదాయం.

వ్యర్థాలు అనేవి వృథా కావని, సరైన ఆలోచనలు ఉంటే ఏ రంగంలోనైనా ఉపాధి అవకాశాలు సృష్టించుకోవచ్చని మహిళా సంఘాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే వ్యర్థాలతో అనేక రకాల వస్తువులు తయారు చేస్తున్న ఈ సంఘాలు తాజాగా కొబ్బరి బొండాలతో కొత్త ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారిగూడాలో మేప్మా ఆధ్వర్యంలో కోకో పీట్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు.

బాడీ లో రోగాలు రాకుండా ఎలా కాపాడుకోవాలి?

ఈ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షి ప్రారంభించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు గ్రాంట్‌గా అందించగా, మహిళా సంఘ సభ్యులు బ్యాంకు రుణంగా మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.4 లక్షలతో యంత్రాలను ఏర్పాటు చేశారు.

మున్సిపాలిటీ నుంచి సేకరించిన వాడిపోయిన కొబ్బరి బొండాలను యంత్రాల ద్వారా క్రష్ చేసి కోకో పీట్, కోకో ఫైబర్‌గా వేరు చేస్తున్నారు. కోకో పీట్‌ను నర్సరీల్లో మొక్కల పెంపకానికి, వ్యవసాయంలో ఎరువుగా, అలాగే ఇంటి తోటలలో ఉపయోగిస్తారు. కోకో ఫైబర్‌ను విగ్రహాల తయారీ, సోఫా బెడ్లు, బస్సు సీట్ల తయారీలో ఉపయోగిస్తున్నారని మహిళా సంఘ సభ్యులు తెలిపారు.

మా ప్రభుత్వం వచ్చాక మహిళల పేరు మీదే పథకాలు ఇస్తున్నాం..

భోజనం చేసేటప్పుడు దాహం ఎందుకు వేస్తుంది? శరీరం ఇచ్చే సిగ్నల్ ఇదే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *