తిరుమలలో జరిగిన ఒక బర్త్డే వేడుక వివాదానికి దారి తీసింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, బిగ్బాస్ ఫేమ్ తనుజ కలిసి తిరుమల పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమె పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం విమర్శలకు కారణమైంది. నిన్న రాత్రి తిరుమల కొండపై ఉన్న ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో తనుజ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
అయితే తిరుమలలో ఉన్న నిబంధనల ప్రకారం కొండపై కేకులు తీసుకెళ్లడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. కేవలం ఎగ్లెస్ కేకులకు మాత్రమే పరిమిత అనుమతి ఉంటుంది. ఈ పరిస్థితిలో కేక్ ఎలా కొండపైకి తీసుకెళ్లారు? తనిఖీ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది ఏమి చేశారు? వీరికి ప్రత్యేక అనుమతి ఉందా? అనే ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.
హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనసు ప్రశాంతంగా ఉండాలంటే…
ఇంకా ఒక అంశం కూడా చర్చనీయాంశమైంది. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వివాహం కాలేదని తెలిసినా తిరుమలలో వీరికి గది ఎలా కేటాయించారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. టిటిడి నిబంధనల ప్రకారం అవివాహితులకు ఒకే గదిని కేటాయించడంపై పరిమితులు ఉంటాయి. మరి ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్య భక్తులు చిన్న వస్తువు తీసుకెళ్లాలన్నా గంటల తరబడి తనిఖీలు ఎదుర్కొంటారని, అయితే ప్రముఖుల విషయంలో మాత్రం అధికారులు ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే స్పష్టత ఇవ్వాలని హిందూ సంఘాలు టిటిడి అధికారులను డిమాండ్ చేస్తున్నాయి.
ఒక్కసారిగా 18 కిలోలు! కేంద్రం సూపర్ నిర్ణయం.
ఇదిలా ఉండగా, గురువారం రాత్రి తిరుమలలో జరిగిన ఈ వేడుకలపై టిటిడి అధికారులు ఇప్పటికే స్పందించినట్లు తెలుస్తోంది. తిరుమలలో కేక్ కట్ చేయడం, వేడుకలు నిర్వహించడం వంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. అలాగే నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని టిటిడి అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మరియు ఇతరులు శ్రీవారి ఆలయం సమీపంలో రీల్స్ చేయడం కూడా భక్తుల ఆగ్రహానికి కారణమైంది. తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని టిటిడి అధికారులు వెల్లడించారు.
ఆయుష్షు పెరిగి బాడీ లో కొవ్వు లేకుండా ఫిట్ గా ఉండాలంటే…
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం: పెరుగుతున్న మృతుల సంఖ్య, ఆందోళనలో బాధితులు.