చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్‌.. మహిళ ఏం చేసిందంటే?

చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్‌.. మహిళ ఏం చేసిందంటే?

Sanitation Worker Found Gold In Trash: చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగల బ్యాగ్‌.. మహిళ ఏం చేసిందంటే:

చెన్నై ట్రిప్లికేన్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల పారిశుద్య కార్మికురాలు పద్మ(Sanitation Worker) తన నిజాయితితో అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిన ఆమె అమ్మన్ కోయిల్ వీధిలో యజమాని లేని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ను గమనించింది. చుట్టూ వెతికినా ఎవరూ కనిపించకపోవడంతో, ఎవరో పొరపాటున వదిలి వెళ్లి ఉంటారని భావించి బ్యాగ్‌ను తెరిచి చూసింది.

అందులో చెత్త ఉంటుందని అనుకున్న పద్మ(Sanitation Worker)కు బంగారు నగలు కనిపించడంతో షాక్ అయింది. చైన్లు, కమ్మలు, గాజులు ధగధగా మెరవడంతో అవి సుమారు 36 తులాలు, దాదాపు 45 లక్షల రూపాయల విలువైనవని అర్థమైంది. నగలు చూసిన క్షణంలోనే అవి పోగొట్టుకున్న కుటుంబం ఎంత వేదన చెందుతుందో అనిపించిందని పద్మ తర్వాత వెల్లడించింది.

MPDO Office Rent Issue:ప్రభుత్వ కార్యాలయానికే దిక్కులేదు.. అద్దె బకాయిలతో రోడ్డున పడ్డ అధికారులు.

ఆ బాధను వారు తట్టుకోలేరని భావించిన ఆమె, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నగలను పోలీసులకు అప్పగించాలని నిర్ణయించుకుంది. వెంటనే తన పై అధికారులకు సమాచారం ఇచ్చి, అనంతరం పాండి బజార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ బంగారాన్ని పోలీసులకు అప్పగించింది.

Sanitation Worker

పోలీసుల దర్యాప్తులో ఆ నగలు రమేష్ అనే వ్యక్తివని తేలింది. స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో అతడు పొరపాటున బ్యాగ్‌ను తోపుడు బండిపై వదిలి వెళ్లినట్లు గుర్తించారు. అవసరమైన పత్రాలు పరిశీలించిన అనంతరం పోలీసులు దాదాపు 45 లక్షల రూపాయల విలువైన 45 సవర్ల బంగారాన్ని రమేష్‌కు తిరిగి అందజేశారు.

Natural Weight Loss Foods: బరువును త్వరగా తగ్గించే ఫుడ్స్ ఇవే.

పద్మ (Sanitation Worker)నిజాయితీ కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆమెను సచివాలయానికి ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఆమె నిజాయితీకి గుర్తింపుగా ప్రభుత్వం తరపున లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని చెక్ రూపంలో అందించారు. గతంలో కూడా పద్మ ఓ ఆటోలో దొరికిన 1.5 లక్షల రూపాయలను బాధితులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్న విషయం తెలిసిందే.

పేద కుటుంబానికి చెందినప్పటికీ పద్మ చూపిన సంస్కారం, నిజాయితీ కోట్లాది రూపాయల కంటే గొప్పదని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Anil Ravipudi: డ్రైవర్ కొడుకు టాప్ డైరెక్టర్ గా ఎలా ఎదిగాడు?

ఇమ్మ్యూనిటి ని పెంచే Antioxidant రిచ్ ఫుడ్స్ ఇవే

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *