ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడం, లంచం కోసం వేధించడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ప్రభుత్వ అధికారి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను ఎప్పుడూ లంచం డిమాండ్ చేయలేదని, ఎవరైనా స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తే మాత్రమే తీసుకుంటానని చెప్పిన ఆ అధికారి చివరకు సస్పెన్షన్‌కు గురయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సీబీ అహిర్వార్ ఈ ఘటనలో ప్రధాన పాత్రధారి. ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న డివిజనల్ అకౌంటెంట్, ఒక క్లర్క్‌పై లంచం ఆరోపణలు రావడంతో లోకాయుక్త పోలీసులు దాడులు నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు.
ALSO READ: యువకుల్లో అంగస్తంభన సమస్య.. గుండె జబ్బులకు ముందస్తు హెచ్చరిక
ఈ ఘటనపై సమాచారం సేకరించేందుకు కార్యాలయానికి వచ్చిన మీడియా ప్రతినిధులు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా లంచం తీసుకున్నారా? ఎవరినైనా డబ్బులు డిమాండ్ చేశారా? ఇస్తేనే పని చేస్తానని చెప్పారా? అంటూ ప్రశ్నించారు.
దీనికి ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు ఎలాంటి పర్సంటేజీలు ఉండవని, ఎవరినీ డబ్బులు అడగనని చెప్పారు. అయితే ఎవరైనా సంతోషంగా వచ్చి డబ్బులు ఇస్తే మాత్రం తీసుకుంటానని, తాను ముందుగానే ఈ విషయం స్పష్టంగా చెబుతానని వెల్లడించారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నానని చెప్పుకొచ్చారు.
ALSO READ: నీళ్ల కోసం ఘర్షణ.. జగిత్యాల జిల్లాలో ఒకరిపై ఒకరు కత్తి దాడి.
అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో అధికారులు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. సీబీ అహిర్వార్ను విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ విచారణ ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతుండగా, మరికొందరు లంచం అడగడం మాత్రమే కాదు, స్వచ్ఛందంగా ఇచ్చినా తీసుకోవడం కూడా తప్పేనని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధి ప్రజలకు సేవ చేయడమే తప్ప, లంచం తీసుకోవడానికి కారణాలు చెప్పడం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి లంచం అడగలేదు కదా అని చెప్పుకున్నంత మాత్రాన బాధ్యత నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని ఈ ఘటన మరోసారి చర్చకు తీసుకొచ్చింది.
ALSO READ: క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ వండే ముందు 45 నిమిషాలు ఆగండి.. ఆరోగ్యానికి
