నటి టబు(Tabu) బాలీవుడ్ మరియు తెలుగు సినీ ప్రేక్షకులకు సూపరిచితురాలు ..తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.అయితే ఈ ముద్దుగుమ్మ, 50 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.చిత్ర పరిశ్రమ లో నటి టబు పేరు వినిపిస్తే చాలు.. ఆమె పెళ్లి గురించి మాత్రమే మాట్లాడుకుంటారు ఆమె విమర్శకులు. ఇప్పటికే టబు పెళ్లి వార్తల కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే నటి టబుపై ఇప్పటికే ఎన్నో పెళ్లి రూమర్లు కూడా వినిపించాయి.
ప్రస్తుతం ఐదుపదుల వయసు వచ్చినా కూడా నటి టబు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆమె ఇప్పటికీ తరగని అందంతో కవ్విస్తుంది. తన వయ్యారాలతో కుర్ర హీరోయిన్స్ ను కూడా ఆశ్చర్య పోయేలా చేస్తుంది. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి టబు. అయితే వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ వన్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యింది నటి టబు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జీవితంలో వివాహం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… తనకు మ్యారేజ్ అవసరం ఏముందని టబు ప్రశ్నించారు. మగాడి తోడు లేకుండా బాగానే ఉన్నానని చెప్పారు. మగాడి అవసరం పడక గదిలో అవసరమొస్తుంది కానీ… లైఫ్లో కాదని అన్నారు.నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి,అందరివాడు,షాక్, ఇదీ సంగతి, పాండురంగడు సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది.